News September 10, 2025

GNT: పీజీ పరీక్షల రీవాల్యుయెషన్ ఫలితాలు విడుదల

image

ఆచార్య నాగార్జున యూనివర్సిటీ పరిధిలో జనవరి 2025లో నిర్వహించిన M.com 1, 3వ, MA. రాజనీతి శాస్త్రం, చరిత్ర, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ 1వ సెమిస్టర్ రెగ్యులర్ పరీక్షల రీవాల్యుయెషన్ ఫలితాలు బుధవారం విడుదలయ్యాయి. విద్యార్థులు అధికారిక వెబ్‌సైట్‌లో తమ రిజిస్టర్ నంబర్ ద్వారా రిజల్ట్స్ తెలుసుకోవచ్చు. ఫలితాలకై https://www.nagarjunauniversity.ac.in/ చూడాలని ANU పరీక్షల విభాగం ఒక ప్రకటన విడుదల చేసింది.

Similar News

News December 11, 2025

విజయవాడలో జాతీయ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్ టోర్నమెంటు

image

AP: యోనెక్స్- సన్‌రైజ్ 87వ సీనియర్ నేషనల్ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్-2025 టోర్నమెంటు ఈనెల 24-28 తేదీల్లో విజయవాడలో జరగనుంది. ఇందుకు సంబంధించిన పోస్టర్‌ను CM CBN ఆవిష్కరించారు. ఏపీలో పదేళ్ల తర్వాత ఈ ఛాంపియన్‌షిప్ పోటీలు నిర్వహిస్తున్నామని మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి, శాప్ ఛైర్మన్ రవి నాయుడు తెలిపారు. ఈ టోర్నమెంటును ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించాలని సీఎం వారికి సూచించారు.

News December 11, 2025

సిద్దిపేట: రేపు సాయంత్రం వరకే ప్రచారం: కలెక్టర్

image

రేపు సాయంత్రం 5 గంటల వరకే రెండో విడత పంచాయతీ ఎన్నికల ప్రచారానికి అనుమతి ఉందని కలెక్టర్ హైమావతి తెలిపారు. జీపీ ఎన్నికల్లో భాగంగా జిల్లాలో 2వ విడత ఎన్నికల పోలింగ్ ఈనెల 14న నిర్వహించనున్నారు. 2వ విడత ఎన్నికలు జరగనున్న అక్బర్పేట భూంపల్లి, బెజ్జంకి, చిన్నకోడూర్, దుబ్బాక, మిరుదొడ్డి, నంగునూరు, నారాయణరావుపేట, సిద్దిపేట రూరల్, అర్బన్, తొగుట మండలాలల్లో 5 గంటలకు ప్రచారం పూర్తి చేయాలన్నారు.

News December 11, 2025

వనపర్తి: విజయోత్సవ ర్యాలీలు నిషేధం: ఎస్పీ

image

మూడు దశల పంచాయతీ ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యే వరకు మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ (MCC) అమల్లో ఉంటుందని ఎస్పీ సునీతారెడ్డి తెలిపారు. ఎన్నికల ఫలితాలు వచ్చినప్పటికీ, ర్యాలీలు, బైక్ శోభాయాత్రలు పూర్తిగా నిషేధమని, నిబంధనలు ఉల్లంఘిస్తే చట్టపరమైన చర్యలు తప్పవని ఆమె హెచ్చరించారు. శాంతియుత వాతావరణం కోసం ప్రతి పౌరుడు సహకరించాలని కోరారు.