News December 1, 2025
GNT: మళ్లీ తెరపైకి ఆ ఎంపీ పేరు.!

2026 జూన్‌లో నాలుగు రాజ్యసభ స్థానాలు ఖాళీ అవబోతున్నాయి. ఈ నేపధ్యంలో టీడీపీ రాజ్యసభ రేసులో గల్లా జయదేవ్ పేరు మళ్లీ వినిపిస్తున్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరగుతోంది. పరిశ్రమలు, పెట్టుబడులపై ఆయన స్పష్టమైన అభిప్రాయాలు, పరిపాలనలో పారదర్శకతకు ఆయన ఇచ్చే ప్రాధాన్యం మళ్లీ హైలైట్ అవుతోంది. కాగా గతంలో గుంటూరు జిల్లా నుంచి అయోధ్య రామిరెడ్డి, మోపిదేవి ఇద్దరు రాజ్యసభకి ఎన్నికవటంతో గల్లా పేరుకు ప్రాముఖ్యం ఉంది.
Similar News
News February 12, 2026
ఉపాధి హామీ పనులు వేగవంతం చేయాలి: కలెక్టర్

ఉపాధి హామీ పనులు (జి రామ్ జి పనులు) వేగవంతం చేయాలని కలెక్టర్ తమీమ్ అన్సారియా ఆదేశించారు. జిల్లా నీటి యాజమాన్య సంస్థ, పంచాయతీరాజ్, మండల పరిషత్ అభివృద్ధి అధికారులుతో గురువారం వీడియో కాన్ఫరెన్స్‌ను కలెక్టర్ నిర్వహించారు. మార్చి నాటికి నిర్దేశించిన లక్ష్యాలు విధిగా పూర్తి కావాలని కలెక్టర్ స్పష్టం చేశారు. పనులు పూర్తి చేయుటకు ప్రతి రోజు, ప్రతి వారం వారీగా లక్ష్యాలు నిర్దేశించుకోవాలని ఆదేశించారు.
News February 12, 2026
విద్యార్థుల సంఖ్య పెరిగేలా చూడాలి: DEO

మంగళగిరి మండలంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను గురువారం జిల్లా విద్యాశాఖ అధికారి షేక్. సలీమ్ భాష ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంగా విద్యార్థుల అసెస్మెంట్ పుస్తకాలు, డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజనం నాణ్యతను డీఈవో పరిశీలించారు. రానున్న విద్యాసంవత్సరంలో విద్యార్థుల సంఖ్య పెరిగేలా ప్రతీ ఉపాధ్యాయుడు కృషిచేయాలని సూచించారు.
News February 12, 2026
GNT: మొదలైన “బిట్స్” క్యాంపస్ పనులు.. మంత్రి లోకేశ్ ట్వీట్

అమరావతిలో బిర్లా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ& సైన్స్(బిట్స్) సంస్థ క్యాంపస్ నిర్మాణ పనులు మొదలయ్యాయంటూ మంత్రి లోకేశ్ గురువారం ట్వీట్ చేశారు. కాగా మందడం, వెంకటపాలెంలో క్యాంపస్ నిర్మాణానికి ఆ సంస్థకు 70 ఎకరాల భూమిని ప్రభుత్వం కేటాయించింది. తొలి దశలో రూ.1,000 కోట్లతో అమరావతిలో బిట్స్ క్యాంపస్ నిర్మిస్తుండగా..AI, ఆవిష్కరణలకు అమరావతి కేంద్రంగా మారుతోందని లోకేశ్ పేర్కొన్నారు.


