News August 23, 2025
GNT: మొదటి ఐదు ర్యాంకుల్లో జిల్లా మంత్రులు

పనితీరు, ఫైల్స్ క్లియరెన్స్‌లో మంత్రులకు సీఎం చంద్రబాబు ర్యాంకులు ప్రకటించారు. 1 స్థానంలో నిమ్మల రామానాయుడు, 2 స్థానంలో నారా లోకేశ్, 3 స్థానంలో సత్యకుమార్ యాదవ్, 4 స్థానంలో అనిత, 5 స్థానంలో నాదెండ్ల మనోహర్ ఉన్నారు. మొదటి ఐదు స్థానాలలో గుంటూరు జిల్లాకు చెందిన ఇద్దరు మంత్రులు ఉండటంతో గుంటూరు జిల్లా అత్యుత్తమ స్థానంలో స్థానంలో నిలిచింది.
Similar News
News January 13, 2026
పందెం కోళ్లు.. పేర్లు తెలుసా?

AP: సంక్రాంతి వేళ రాష్ట్రంలోని పలు చోట్ల బరులు, కాళ్ల బలం చూపించేందుకు కోళ్లు సిద్ధమయ్యాయి. నెలలుగా ప్రత్యేక శిక్షణ, ఆహారం ఇచ్చి రెడీ చేసిన తమ కోళ్లను బరిలో దించి గెలిచేందుకు యజమానులు వ్యూహాలు రచిస్తున్నారు. ముఖ్యంగా సేతు, కాకి, డేగ, నెమలి, పర్ల, రసంగి, కిక్కిరాయి, మైల, పింగళి, అబ్రాస్ రకాలను బరిలో దించుతుంటారు. కోళ్ల ఈకల రంగు, మెడ, కాళ్ల సైజు, శరీర తత్వాన్ని బట్టి వాటికి పేర్లు పెడతారు.
News January 13, 2026
కోడి పందేలు నిర్వహిస్తే కఠిన చర్యలు: ఎస్పీ నరసింహ

సంక్రాంతి సందర్భంగా కోడి పందాలు, జూదం నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ నరసింహ హెచ్చరించారు. పండుగను సంప్రదాయ పద్ధతిలో జరుపుకోవాలని, అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే సహించేది లేదన్నారు. మహిళలు అపరిచితుల పట్ల అప్రమత్తంగా ఉండాలని, బంగారు ఆభరణాల దొంగతనాల పట్ల జాగ్రత్త వహించాలని సూచించారు. జిల్లా వ్యాప్తంగా పోలీసు నిఘా ఉంటుందని ఎస్పీ స్పష్టం చేశారు.
News January 13, 2026
JN: రూ.100 కోట్లకు పైగానే అక్రమాలు!

భూభారతిలో అక్రమార్కులు ప్రభుత్వ ఖజానాకు సుమారు రూ.100 కోట్లు గండి కొట్టినట్లు తెలుస్తోంది. 2020 Nov 2 నుంచి 31 DEC 2025 వరకు (భూభారతి + ధరణి ) 52,13,729 ట్రాన్సాక్షన్లు జరిగాయి. 41,38,641 సేల్ డీడ్ ట్రాన్సాక్షన్లతో ప్రభుత్వానికి రూ.13,473 కోట్ల ఆదాయం వచ్చింది. సుమారు 5,200 స్లాట్ బుకింగ్‌లలో అక్రమాలు జరిగినట్లు సమాచారం. NLG, MDK, RR జిల్లాల్లోనే అత్యధిక ఫ్రాడ్ జరిగినట్లు పోలీసులు గుర్తించారు.


