News December 1, 2025
GNT: విడదల రజిని చూపు ఎటువైపు..?

మాజీ మంత్రి విడదల రజిని వైసీపీతో బంధం సడలిస్తున్నారన్న ప్రచారం రాజకీయ వర్గాల్లో వేడి పెంచుతోంది. గుంటూరు పశ్చిమ ఓటమి అనంతరం చిలకలూరిపేటలో చురుగ్గా ఉన్న ఆమెను రేపల్లెకు వెళ్లమన్న పార్టీ అధినేత ఆదేశం అసంతృప్తికి కారణమైనట్లు టాక్. దీంతో ఆమె త్వరలో పార్టీ మారే అవకాశాలపై జోరుగా చర్చ జరుగుతోంది.
Similar News
News February 16, 2026
BREAKING: కడ్తాల్ వద్ద రెండు కార్లు ఢీ.. ఇద్దరి దుర్మరణం

కడ్తాల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కర్కల్ పహాడ్ గేట్ సమీపంలో ఆదివారం రాత్రి ప్రమాదం జరిగింది. NH 765పై రెండు కార్లు ఒకదానిని మరొకటి ఢీకొన్నాయి. ఈ ఘటనలో కార్లలో ప్రయాణిస్తున్న నరేంద్ర చారి (37), ఎస్‌కే సైదులు (30) అక్కడికక్కడే మృతి చెందారు. మరో వ్యక్తి పరిస్థితి విషమంగా ఉండటంతో చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
News February 16, 2026
GNT: శివరాత్రి వేళ ప్రత్యేక ఆకర్షణగా ‘పొట్టేళ్ల ప్రభ’

మహాశివరాత్రిని పురస్కరించుకొని పొన్నూరులో ఆదివారం సాయంత్రం నిర్వహించిన పొట్టేళ్ల ప్రభ భక్తులను విశేషంగా ఆకట్టుకుంది. తెలగపాలెంకు చెందిన బోడి రామారావు కుటుంబం గత 13 ఏళ్లుగా పొట్టేళ్లను ప్రత్యేకంగా పెంచి, ఈ ప్రభను సిద్ధం చేస్తోంది. సంప్రదాయం ప్రకారం పొన్నూరు నుంచి కట్టెంపూడిలోని సంగమేశ్వరస్వామి ఆలయం వరకు ఈ ప్రభను ప్రదర్శనగా తీసుకెళ్లారు. ఈ అపురూప దృశ్యాన్ని చూసేందుకు ప్రజలు భారీగా తరలివచ్చారు.