News August 20, 2025
GNT: 2nd ఛాన్స్.. నేటితో లాస్ట్

ఉచిత విద్యాహక్కు చట్టం-2009 కింద ప్రైవేట్ పాఠశాలల్లో ఒకటో తరగతి ప్రవేశాలకు పాఠశాల విద్యాశాఖ అదనపు నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈనెల 20 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆసక్తి ఉన్నవారు http://cse.ap.gov.in వెబ్‌సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని అధికారులు తెలిపారు. ఇప్పటికే మేలో ఒకసారి నోటిఫికేషన్ జారీ చేశారు.
Similar News
News January 22, 2026
GNT: ప్రియుడుతో కలిసి భర్తను చంపిన భార్య.. పోలీసుల అదుపులో నిందితులు

దుగ్గిరాల(M) చిలువూరులో ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసిన ఘటనలో ప్రియురాలు సహా ప్రియుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ మేరకు మృతుడి భార్య లక్ష్మి మాధురి, ప్రియుడు గోపిలను దుగ్గిరాల ఎస్సై వెంకట రవి విచారిస్తున్నారు. భర్తను చంపిన తర్వాత డెడ్‌బాడీ పక్కన కూర్చొని రాత్రంతా పోర్న్ వీడియోలు చూసినట్లు విచారణలో తేలింది. దిండుతో ఊపిరాడకుండా హత్య చేసి గుండెపోటుతో మరణించాడని నమ్మబలికిన విషయం తెలిసిందే.
News January 22, 2026
గుంటూరు జిల్లాలో 22 రేషన్ షాపులపై కేసులు

రేషన్ మాఫియా అక్రమాలను అరికట్టడానికి జిల్లా సివిల్ సప్లై యంత్రాంగం పకడ్బందీగా పని చేస్తోందని ఆ శాఖ జిల్లా అధికారి కోమలి పద్మ తెలిపారు. అక్టోబరు నుంచి జిల్లాలో 22 రేషన్ షాపుల మీద 6A కేసులు, 4 క్రిమినల్ కేసులు నమోదు చేసి, వారిపై చర్యలకు ఆదేశించినట్లు ఆమె పేర్కొన్నారు. అక్రమంగా రవాణా అవుతున్న 763 క్వింటాళ్ల బియ్యాన్ని స్వాధీనం చేసుకుని, 6A కేసులు 31, క్రిమినల్ కేసులు 28 నమోదు చేశామన్నారు.
News January 22, 2026
GNT: మూడేళ్ల పరారీకి చెక్.. అత్యాచార నిందితుడు అరెస్ట్

అత్యాచార కేసులో నిందితుడిగా ఉండి 3 సంవత్సరాల నుంచి తప్పించుకొని తిరుగుతున్న వ్యక్తిని గుంటూరు నగరంపాలెం పోలీసులు బుధవారం అరెస్ట్ చేసి కోర్టులో హాజరు పరిచారు. ఏటీ అగ్రహారం 2వ లైనుకు చెందిన ఊదర నరసింహారావు అత్యాచార కేసులో నిందితుడిగా ఉన్నాడని సీఐ సత్యనారాయణ చెప్పారు. తప్పించుకొని తిరుగుతున్న నిందితుణ్ణి పట్టుకున్నామని అన్నారు. చట్టవ్యతిరేక కార్యకలాపాలు సహించేది లేదని హెచ్చరించారు.


