News December 6, 2024
GNT: ANUలో గెస్ట్ ఫ్యాకల్టీ అరెస్ట్
ANUలో గెస్ట్ ఫ్యాకల్టీగా పనిచేస్తున్న పృథ్వీరాజ్ అరెస్ట్ అయ్యాడు. పోలీసుల కథనం.. పెదకాకాణిలోని నంబూరు విజయభాస్కర్ నగర్‌కు చెందిన యువతి ANUలో ఇంజినీరింగ్ చదువుతోంది. పృథ్వీ ఆ యువతికి ప్రేమ పేరుతో దగ్గరయ్యాడు. పెళ్లి చేసుకోమని కోరగా నిరాకరించడంతో.. యువతి పోలీసులను ఆశ్రయించింది. ఆతనికి నగదు, లాప్‌ట్యాప్ ఇచ్చినట్లు పేర్కొంది. నిందితుడిని గురువారం కోర్టులో హాజరుపరచగా రిమాండ్ విధించినట్లు సీఐ తెలిపారు.
Similar News
News January 22, 2025
మాచవరం: ఆమెపై లైంగిక దాడికి మరో మహిళ సహాయం
మాచవరంలో మహిళపై లైంగిక దాడికి సంబంధించి ఇద్దరిపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై సతీశ్ మంగళవారం తెలిపారు. ఎస్సై కథనం.. మాచవరానికి చెందిన మహిళ అదే ప్రాంతానికి చెందిన వ్యక్తితో స్నేహం ఉండేది. ఇటీవల ఆమెకు వేరే వ్యక్తితో వివాహం కుదిరింది. ఈ క్రమంలో స్నేహితునితో కలిసి దిగిన ఫొటోలను ఇవ్వాలంటూ అడిగింది. ఫొటోలు ఇస్తానని తెలంగాణకు తీసుకొచ్చి లైంగిక దాడికి పాల్పడ్డారు. అతనికి సహకరించిన మరో మహిళపై కేసు నమోదైంది.
News January 22, 2025
అధికారులకు గుంటూరు కలెక్టర్ సూచనలు
తాడేపల్లి నగరపాలక సంస్థ పరిధిలోని ఆక్రమిత ప్రాంతాల్లోని నివాసాలను నిర్దేశిత మార్గదర్శకాలకు అనుగుణంగా రెగ్యులరైజేషన్ చేయడానికి సంబంధిత శాఖలు ప్రతిపాదనలను ప్రభుత్వానికి అందించేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ నాగలక్ష్మీ తెలిపారు. కలెక్టరేట్ కార్యాలయంలో మంగళవారం రెవెన్యూ, ఫారెస్ట్, ఇరిగేషన్, రైల్వే, మున్సిపల్ అధికారులతో కలెక్టర్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. సర్వేలో 16,025 నివాసాలు గుర్తించామన్నారు.
News January 21, 2025
గుంటూరు పట్టణంలో భారీ పేలుడు
గుంటూరులోని బ్రాడీపేట ఆరోలైను 18వ అడ్డరోడ్డు వద్ద సోమవారం భారీ పేలుడు సంభవించింది. ఒక ఇంట్లో నుంచి వచ్చిన పేలుడు ధాటికి పరిసర ప్రాంతాల ప్రజలు ఉలిక్కిపడ్డారు. ప్రమాదంలో ఇంటి యజమాని గన్ సైదా 8ఏళ్ల కుమార్తె గాయపడింది. విద్యుత్ఘాతంతో పేలుడు సంభవించిందని క్లూస్ టీం ప్రాథమికంగా అంచనాకు వచ్చింది. పట్టాభిపురం పోలీసులు రంగం ప్రవేశం చేసి ఇళ్లల్లో తనిఖీలు చేయగా పేలుడు పదార్థాలేమీ లభ్యం కాలేదు.