News September 13, 2025
GNT: CRDAలో 102 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్

CRDA ఇంజినీరింగ్ విభాగంలో 102 కాంట్రాక్ట్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. 50 అసిస్టెంట్/ అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్, 25 డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్, 15 ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్, చీఫ్(4), సూపరింటెండెంట్ ఇంజినీర్(8) పోస్టులు భర్తీ చేస్తున్నామని, అర్హులైన అభ్యర్థులు ఈ నెల 26లోపు దరఖాస్తు చేసుకోవాలని కమిషనర్ కన్నబాబు తెలిపారు. దరఖాస్తు వివరాలకు https://crda.ap.gov.in/ చూడాలన్నారు.
Similar News
News December 15, 2025
నరసాపురం వరకు వందేభారత్.. నేడే ప్రారంభం

AP: చెన్నై సెంట్రల్-విజయవాడ వందేభారత్ ఎక్స్‌ప్రెస్ నేటి నుంచి నరసాపురం వరకు నడవనుంది. ఇవాళ కేంద్ర మంత్రి శ్రీనివాసవర్మ నరసాపురం రైల్వేస్టేషన్‌లో జెండా ఊపి చెన్నై వెళ్లే రైలును ప్రారంభిస్తారు. షెడ్యూల్.. చెన్నై నుంచి రైలు(20677) 5.30AMకు బయలుదేరి 11.45AMకు విజయవాడ వస్తుంది. గుడివాడ, భీమవరం మీదుగా 2.10PMకు నరసాపురం చేరుకుంటుంది. తిరిగి ట్రైన్(20678) 2.50PMకు బయలుదేరి 11.45PMకు చెన్నైకి వెళ్తుంది.
News December 15, 2025
ఆవుండగా గాడిద పాలు పితికినట్లు

ఒక పనిని సులభంగా, సరైన మార్గంలో చేసే అవకాశం లేదా వనరులు అందుబాటులో ఉన్నప్పటికీ.. దానిని విస్మరించి, కష్టమైన, పనికిరాని, అసాధ్యమైన మార్గాన్ని ఎంచుకున్న సందర్భంలో ఈ సామెతను ఉపయోగిస్తారు. అందుబాటులో ఉన్న మంచి అవకాశాన్ని వదులుకుని అనవసరమైన శ్రమకు పోవడాన్ని ఈ సామెత సూచిస్తుంది.
News December 15, 2025
శివంపేట: ఓట్ల కోసం బట్టలు ఉతుకుతూ ప్రచారం

శివంపేట మండలం అల్లీపూర్ గ్రామ 1వ వార్డులో వార్డు సభ్యురాలి భర్త చాకలి బాబు వినూత్నంగా ప్రచారం చేశారు. తన భార్య తరఫున ప్రచారం నిర్వహిస్తూ ఇంటింటికి వెళ్లి మహిళలతో కలిసి బట్టలు ఉతుకుతూ, గ్రామంలోని సమస్యలపై చర్చిస్తూ ప్రజలకు చేరువయ్యారు. ఈ వింత ప్రచారం అల్లీపూర్‌తో పాటు పరిసర ప్రాంతాల్లో ఆసక్తిని రేకెత్తించింది.


