News April 1, 2024
ఇంటికే వెళ్లి పింఛన్లు ఇవ్వాలి: సీఎస్‌కు టీడీపీ వినతి

AP: వాలంటీర్లపై ఈసీ ఆంక్షలు విధించినందున లబ్ధిదారులకు పెన్షన్లను ఇంటి వద్దే అందించే ఏర్పాట్లు చేయాలని సీఎస్ జవహర్‌రెడ్డికి టీడీపీ నేతలు వినతి పత్రం అందించారు. పెన్షన్ల పంపిణీని ఈ నెల 5లోగా పూర్తి చేయాలని కోరారు. ఈసీ ఉత్తర్వులను అమలు చేసే బాధ్యత ప్రభుత్వానిదేనని స్పష్టం చేశారు. ఈ వ్యవహారంలో టీడీపీకి చెడ్డపేరు తెచ్చేందుకు సీఎం జగన్ ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు.
Similar News
News February 10, 2026
బీసీ రిజర్వేషన్ల పెంపు బిల్లులు పరిశీలనలో ఉన్నాయి: కేంద్రం

తెలంగాణలో బీసీ రిజర్వేషన్ల పెంపు బిల్లులు తమ పరిశీలనలో ఉన్నాయని కేంద్రం తెలిపింది. విద్యా, ఉద్యోగాలు, స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్లను 42శాతానికి పెంచడంపై BJP ఎంపీ ఈటల రాజేందర్ లోక్‌సభలో లేవనెత్తిన ప్రశ్నకు కేంద్ర సామాజిక న్యాయశాఖ మంత్రి బీఎల్ శర్మ పైవిధంగా సమాధానం ఇచ్చారు. అసెంబ్లీ కార్యదర్శి నుంచి 2 బిల్లులు రాష్ట్రపతి ఆమోదం కోసం వచ్చాయని వివరించారు.
News February 10, 2026
‘ఫోర్ స్టార్స్ ఆఫ్ డెస్టినీ’పై స్పందించిన నరవణె

‘ఫోర్ స్టార్స్ ఆఫ్ డెస్టినీ’ పుస్తకంపై వివాదం చెలరేగిన వేళ మాజీ చీఫ్ ఆఫ్ ఇండియన్ ఆర్మీ జనరల్ మనోజ్ ముకుంద్ నరవణె స్పందించారు. పుస్తకం పబ్లిషింగ్, డిజిటల్ ఫామ్, ప్రింట్ పూర్తి కాలేదని వెల్లడించారు. పెంగ్విన్ ర్యాండమ్ హౌస్ ఇండియా ఇచ్చిన స్టేట్‌మెంట్‌ను పోస్ట్‌కు ట్యాగ్ చేశారు.
News February 10, 2026
భారీ టార్గెట్‌ను ఊదేశారు

T20WC: UAEపై న్యూజిలాండ్ జట్టు ఘన విజయం నమోదు చేసింది. ఒక్క వికెట్ కూడా కోల్పోకుండానే 174 పరుగుల లక్ష్యాన్ని ఛేదించింది. ఓపెనర్లు టిమ్(89), ఫిన్ అలెన్(84) బౌలర్లపై విరుచుకుపడ్డారు. ఫోర్లు, సిక్సులతో చెలరేగారు. 4.4 ఓవర్లు మిగిలి ఉండగానే ఆటను ముగించేశారు. యూఏఈ బౌలర్లు ఎవరూ కివీస్ బ్యాటర్లపై ప్రభావం చూపలేకపోయారు. రొహిద్ ఖాన్, జునైద్‌లు 40+ పరుగులు సమర్పించుకున్నారు.


