News March 6, 2025
దైవం మనుష్య రూపేణ!

ఓ తల్లి కష్టం చూసి ఆ దేవుడే దిగి వచ్చాడేమో అనిపించే ఘటన చైనాలో జరిగింది. జింగ్ అనే మహిళకు గుండె సంబంధిత వ్యాధితో కొడుకు జన్మించాడు. పెళ్లి విఫలమవడంతో కొడుకును కాపాడుకునేందుకు సొంతంగా చిన్న దుకాణం పెట్టుకొని ఆమె తీవ్రంగా శ్రమించింది. అయితే ఒకరోజు రాత్రి షాప్‌కు వచ్చిన ఓ వ్యక్తి దాదాపు ఆపరేషన్ కోసం కావాల్సిన డబ్బు మొత్తం చెల్లించి వెళ్లిపోయాడు. ఇది చూసి ఆ తల్లి సంతోషంలో కన్నీరుమున్నీరైంది.
Similar News
News December 10, 2025
తెలంగాణ న్యూస్ రౌండప్

⭒ నేడు ఉస్మానియా వర్సిటీకి సీఎం రేవంత్.. పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేసి బహిరంగ సభలో ప్రసంగించనున్న సీఎం
⭒ 2047 నాటికి HYDలో 623kms మేర మెట్రో నెట్‌వర్క్‌ను విస్తరించనున్నట్లు విజన్ డాక్యుమెంట్‌లో పేర్కొన్న ప్రభుత్వం
⭒ యువతకు అడ్వాన్స్‌డ్ స్కిల్స్‌పై శిక్షణ, ఉపాధి కల్పనపై టాటా టెక్, అపోలో సహా పలు సంస్థలతో ప్రభుత్వం రూ.72కోట్ల విలువైన 9 ఒప్పందాలు
News December 10, 2025
గాయపడిన సింహం.. తిరిగొచ్చి అదరగొట్టింది!

‘గాయపడిన సింహం నుంచి వచ్చే శ్వాస గర్జనకన్నా భయంకరంగా ఉంటుంది’ అనే డైలాగ్ హార్దిక్ పాండ్యకు సరిగ్గా సరిపోతుంది. గాయం నుంచి కోలుకుని SAతో తొలి T20లో రీఎంట్రీ ఇచ్చిన అతడు 28 బంతుల్లో 59* రన్స్ చేశారు. ఓవైపు ఇతర బ్యాటర్లు వికెట్ కాపాడుకునేందుకే అవస్థలు పడుతుంటే పాండ్య మాత్రం కామ్&కంపోజ్డ్ షాట్లతో విరుచుకుపడ్డారు. బౌలింగ్‌లోనూ తొలి బంతికే వికెట్ తీశారు. ఇరు జట్లలో వేరే ఏ ఆటగాడు 30+ స్కోర్ చేయలేదు.
News December 10, 2025
తిరుమల శ్రీవారి చెంత బయటపడ్డ మరో స్కాం

కలియుగ దైవం తిరుమల వేంకటేశ్వరుడిని మోసం చేసిన మరో స్కాం బయటకొచ్చింది. వేద ఆశీర్వచనం పొందే ప్రముఖులకు ఇచ్చే పట్టువస్త్రాల (సారిగ దుపట్టా) కొనుగోలులో భారీ మోసం, అక్రమాలు జరిగినట్లు TTD విజిలెన్స్ గుర్తించింది. నగరికి చెందిన VRS ఎక్స్‌పోర్ట్స్ ₹100 విలువ చేయని పాలిస్టర్ క్లాత్‌ను పట్టు అని ₹1400కు సరఫరా చేసినట్లు బోర్డుకు తెలిపింది. 2015-25 మధ్య ఇలా శ్రీవారి ఖజానా నుంచి ₹54 కోట్లు దోచుకుంది.


