News August 6, 2024
రూ.5,560 కోట్లతో గోదావరి స్టేజ్-2

TG: గోదావరి రెండో దశ ప్రాజెక్టుకు రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. రూ.5,560 కోట్లను ఈ ప్రాజెక్టు కోసం కేటాయించింది. మల్లన్నసాగర్ నుంచి 15TMCల నీటిని తరలించనుంది. ఇందులో 10 TMCలతో 2030 వరకు HYD తాగునీటి అవసరాలు తీర్చాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. మిగతా 5 TMCల నీటి తరలింపుతో హిమాయత్‌సాగర్, ఉస్మాన్‌సాగర్, మూసీకి పునర్జీవం కల్పించేలా ప్రభుత్వం సమాలోచనలు చేస్తోంది.
Similar News
News December 6, 2025
నిజమైన భక్తులు ఎవరంటే?

ఏదో ఆశించి భగవంతుడిని సేవించేవారు వ్యాపారస్తులు. వారు తమ కోరికల కోసం దేవునికి డబ్బు ఇచ్చి బదులుగా ఏదో ఆశిస్తారు. కానీ ఫలాపేక్ష లేకుండా స్వామిని కొలిచేవారే నిజమైన భక్తులు. మనం అడగకుండానే దేవుడు కరుణించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే కష్టాలన్నీ ఆయన భగవతం ద్వారానే ధరించాడు. ఇదే నిస్వార్థ భక్తి. మనం ఏమీ ఆశించకుండా మన శక్తి మేరకు సత్కార్యాలు చేస్తూ, ఆ ఈశ్వరుడిని అందరిలో చూస్తూ సంతోషాన్ని పంచాలి. <<-se>>#Daivam<<>>
News December 6, 2025
బంధం బలంగా మారాలంటే?

భార్యాభర్తలిద్దరూ ఒకరితో ఒకరు ఎంత సమయం గడిపితే అనుబంధం అంత దృఢమవుతుందంటున్నారు నిపుణులు. వ్యక్తిగత, కెరీర్ విషయాల్లో ఇద్దరూ ఎంత బిజీగా ఉన్నా.. రోజూ కాసేపు కలిసి సమయం గడిపేలా ప్లాన్ చేసుకోవాలని సూచిస్తున్నారు. తమ మధ్య పెరిగిన దూరానికి అసలు కారణాలేంటో, ఇద్దరి మనసుల్లో ఉన్న ఆలోచనలేంటో పంచుకోవాలి. అప్పుడే సమస్యకు పరిష్కారం దొరుకుతుంది.. ఇద్దరూ తిరిగి కలిసిపోయేందుకు మార్గం సుగమమవుతుంది.
News December 6, 2025
అప్పుల భారతం.. ఎంతమంది EMIలు కడుతున్నారో తెలుసా?

దేశంలో 28.3 కోట్ల మంది అప్పుల్లో ఉన్నట్లు కేంద్రం వెల్లడించింది. ఏడేళ్లలో భారీగా పెరిగారని కేంద్ర మంత్రి పంకజ్ చౌదరి లోక్‌సభలో తెలిపారు. 2017-18లో 12.8 కోట్ల మంది అప్పుల్లో ఉన్నారని పేర్కొన్నారు. 2025లో కుటుంబ రుణాలు ₹15.7 లక్షల కోట్లకు చేరాయని చెప్పారు. 2018లో సగటున ఒక్కొక్కరిపై ₹3.4 లక్షల అప్పు ఉండగా, ఇప్పుడు ₹4.8 లక్షలకు పెరిగింది. ఈ లెక్కన దేశంలో ప్రతి ఐదుగురిలో ఒకరు EMIలు కడుతున్నారు.


