News August 22, 2025
స్వల్పంగా తగ్గిన బంగారం ధర

నిన్న పెరిగిన బంగారం ధరలు ఇవాళ కాస్త తగ్గాయి. HYD బులియన్ మార్కెట్‌లో ఇవాళ 24 క్యారెట్ల పసిడి 10 గ్రాములపై రూ.220 తగ్గి రూ.1,00,530కు చేరింది. ఇక 22 క్యారెట్ల గోల్డ్ 10 గ్రాములపై రూ.150 పతనమై రూ.92,150 పలుకుతోంది. అటు KG వెండి ధరపై రూ.2,000 పెరిగి రూ.1,28,000గా ఉంది. తెలుగు రాష్ట్రాల్లో దాదాపు ఇవే ధరలున్నాయి.
Similar News
News January 15, 2026
₹2 లక్షలు డిస్కౌంట్.. అయినా కొనేవారు లేరు!

ఇండియాలో గ్రాండ్‌గా ఎంట్రీ ఇద్దామనుకున్న టెస్లాకు గట్టి షాకే తగిలింది. గతేడాది దిగుమతి చేసుకున్న 300 మోడల్ Y కార్లలో దాదాపు 100 అమ్ముడవక షెడ్డుకే పరిమితమయ్యాయి. ముందే బుక్ చేసుకున్న వారూ ఇప్పుడు వెనక్కి తగ్గుతుండటంతో మస్క్ కంపెనీ దిద్దుబాటు చర్యలు మొదలుపెట్టింది. స్టాక్‌ను క్లియర్ చేసేందుకు ఏకంగా ₹2 లక్షల వరకు డిస్కౌంట్ ప్రకటించింది. భారీ ధరలు, తక్కువ డిమాండ్ కారణంగానే ఈ పరిస్థితి నెలకొంది.
News January 15, 2026
కమ్యునికేషన్ లేకపోవడమే గొడవలకు కారణం

ఏం మాట్లాడినా గొడవలవుతున్నాయని చాలామంది కంప్లైంట్ చేస్తుంటారు. దీనికి వారి కమ్యునికేషన్ పాటర్న్ కారణమంటున్నారు మానసిక నిపుణులు. ఒకరు ఫీలింగ్స్ గురించి మాట్లాడితే, మరొకరు లాజికల్‌గా మాట్లాడతారు. ఒకరు ప్రజెంట్ గురించి, మరొకరు పాస్ట్ గురించి డిస్కస్ చేస్తారు. కాబట్టి దేని గురించి డిస్కస్ చేస్తున్నారో ఇద్దరికీ క్లారిటీ ఉండటం ముఖ్యమంటున్నారు. అప్పుడే బంధంలో అపార్థాలకు తావుండదని సూచిస్తున్నారు.
News January 15, 2026
సేంద్రియ సాగుతోనే సక్సెస్

కర్ణాటకలోని చిక్కబల్లాపూర్ జిల్లాలోని గౌరిబిదనూర్లో బంజరు భూమిని పదేళ్లకు లీజుకు ఉమేష్ వ్యవసాయం ప్రారంభించారు. రెండు ఎకరాల్లో ఒకవైపు సాగును కంటిన్యూ చేస్తూ భూమిని సారవంతం చేసుకున్నారు. కోడి ఎరువు, మేక ఎరువు, ఆవు పేడ ఎరువును కలిపి నేలను సారవంతంగా మార్చారు. మార్కెట్ స్టడీ చేసి ఓడీసీ-3 వెరైటీ మునగ మొక్కలను నాటారు. ఇవి అనుకున్నట్టుగానే 3-4 నెలల్లోనే కాపుకు వచ్చి, ఆరు నెలల్లో మంచి దిగుబడి వచ్చింది.


