News August 11, 2025

తగ్గిన బంగారం ధరలు

image

గతవారం భారీగా పెరిగిన బంగారం ధరలు ఈరోజు కాస్త ఊరటనిచ్చాయి. దీంతో హైదరాబాద్‌లో 24 క్యారెట్ల పసిడి 10 గ్రాములపై రూ.760 తగ్గి రూ.1,02,280కు చేరింది. ఇక 22 క్యారెట్ల గోల్డ్ 10 గ్రాములపై రూ.700 పతనమై రూ.93,750 పలుకుతోంది. అటు వెండి ధరల్లో ఎలాంటి మార్పు లేదు. ప్రస్తుతం కేజీ సిల్వర్ రేటు రూ.1,27,000గా ఉంది. తెలుగు రాష్ట్రాల్లో దాదాపు ఇవే ధరలున్నాయి.

Similar News

News March 10, 2026

BREAKING: 13న అకౌంట్లలో డబ్బులు జమ

image

రైతులు ఎంతగానో ఎదురుచూస్తున్న పీఎం కిసాన్ పెట్టుబడి సాయం నిధుల విడుదల డేట్ ఫిక్స్ అయింది. ఈ నెల 13న 22వ విడత డబ్బులు జమ చేయనున్నట్లు కేంద్రం ప్రకటించింది. ప్రధాని మోదీ అస్సాం పర్యటనలో ఈ డబ్బులు రిలీజ్ చేస్తారు. కేంద్రం ఏటా 3 విడతల్లో రూ.2వేల చొప్పున మొత్తం రూ.6వేలు రైతుల ఖాతాల్లో జమ చేస్తోంది. దీని ద్వారా సుమారు 10 కోట్ల మంది లబ్ధి పొందుతున్నారు.

News March 10, 2026

ప్రజలపై భారం.. మీ విద్యుత్ కొనం: NTPCకి రాష్ట్రం లేఖ

image

TG: బయట చౌకగా దొరుకుతున్నా ఒప్పందం పేరిట ఎక్కువ ధర ఉన్న NTPC విద్యుత్తును కొనేది లేదని రాష్ట్రం ఆ సంస్థకు లేఖ రాసింది. తక్కువ ధరకు విద్యుత్ సరఫరా చేస్తామని కేంద్రం హామీ ఇచ్చిందని గుర్తు చేసింది. అటు సంస్థ నిర్మిస్తున్న 2400MW ప్రాజెక్టుకు సింగరేణి నుంచి బొగ్గు సరఫరా చేయలేమని తేల్చి చెప్పింది. నిల్వలు ఉంటే సరఫరాపై పరిశీలిస్తామంది. ప్రజలపై భారం పడకుండా తక్కువ ధరకు విద్యుత్ ఇవ్వాలని స్పష్టం చేసింది.

News March 10, 2026

మీ గ్యాస్ సిలిండర్ బుక్ అవుతోందా?

image

గల్ఫ్ యుద్ధంతో మన దగ్గర గ్యాస్ సప్లైలో కొరత ఏర్పడింది. డొమెస్టిక్ సిలిండర్లు ఆన్‌లైన్‌లో బుక్ అవ్వడం లేదని కొందరు వాపోతున్నారు. 10 రోజుల కింద బుక్ చేసినా డెలివరీ చేయడం లేదని మరికొందరు ఫిర్యాదులు చేస్తున్నారు. అయితే కొన్ని ఏజెన్సీలు కావాలనే కృత్రిమ కొరత సృష్టిస్తున్నాయనే ఆరోపణలూ ఉన్నాయి. బుకింగ్‌ సమస్య మీకూ ఎదురవుతోందా? అయితే సంబంధిత సంస్థలకు మెయిల్, ఫోన్ ద్వారా కంప్లైంట్ చేయండి.