News September 10, 2025
మళ్లీ పెరిగిన బంగారం ధరలు

బంగారం ధరలు క్రమంగా పెరుగుతూ ఆల్ టైమ్ రికార్డుకు చేరుతున్నాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో ఇవాళ 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.219 పెరిగి రూ.1,10,509కు చేరింది. ఇక 22 క్యారెట్ల 10g గోల్డ్ రూ.200 ఎగబాకి రూ.1,01,300 పలుకుతోంది. అటు KG వెండి ధర రూ.1,40,000గా ఉంది. తెలుగు రాష్ట్రాల్లో దాదాపు ఇవే ధరలున్నాయి.
Similar News
News December 17, 2025
కౌలు రైతులకు రూ.లక్ష రుణం.. ఎవరు అర్హులు?

AP: కౌలు రైతులకు రూ. లక్ష వరకు రుణం ఇవ్వాలని నిర్ణయించిన ప్రభుత్వం ఆ దిశగా చర్యలను వేగవంతం చేసింది. ఇప్పటికే ఆయా జిల్లాల అధికారులు లబ్ధిదారుల జాబితాలను సిద్ధం చేస్తున్నారు. రైతులు వ్యక్తిగతంగా లేదా సంఘంగా ఏర్పడి రుణాలను పొందవచ్చు. ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాల ద్వారా అందించే ఈ రుణాలకు అర్హతను ఎలా నిర్ణయిస్తారు?, ఎవరికి ప్రాధాన్యం ఉంటుందో తెలుసుకోవడానికి <<-se_10015>>పాడిపంట<<>> క్లిక్ చేయండి.
News December 17, 2025
తుది పోరు.. పోలింగ్ ప్రారంభం

తెలంగాణలో తుది విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. మొన్నటి వరకు జోరుగా ప్రచారం చేసిన సర్పంచ్, వార్డు అభ్యర్థుల భవితవ్యాన్ని ఓటర్లు బ్యాలెట్ బాక్సుల్లో నిక్షిప్తం చేయనున్నారు. మధ్యాహ్నం ఒంటిగంట వరకు పోలింగ్ జరగనుంది. మ.2 గంటల తర్వాత ఓట్ల లెక్కింపు, తర్వాత ఫలితాల వెల్లడి ఉంటుంది. నేటితో రాష్ట్రంలో పంచాయతీ పోరు ముగియనుంది. అయితే రేపటి వరకు సెక్షన్ 136 అమల్లో ఉంటుందని పోలీసులు తెలిపారు.
News December 17, 2025
ఇతిహాసాలు క్విజ్ – 99

ఈరోజు ప్రశ్న: హిందూ పురాణాల ప్రకారం.. ఈ మాసంలో సూర్య కిరణాలు ప్రత్యేక తేజస్సుతో ఉండి, అశుభాలను తొలగిస్తాయని నమ్ముతారు. అలాగే, ఈ మాసం శని దేవుని జన్మ నక్షత్రంగా పరిగణిస్తారు. ఇంతకీ అది ఏ మాసం?
☛ పై ప్రశ్నకు జవాబును సాయంత్రం ఆరు గంటలకు పబ్లిష్ చేస్తాం.
☛ మీకు సమాధానం తెలిస్తే కామెంట్ రూపంలో తెలియజేయండి.
<<-se>>#Ithihasaluquiz<<>>


