News November 12, 2025
GOOD NEWS: ఎల్లుండి నుంచి ‘సదరం’ స్లాట్ బుకింగ్

APలోని దివ్యాంగులకు శుభవార్త. వారి వైకల్య నిర్ధారణకు ఈ నెల 14 నుంచి సదరం స్లాట్ బుకింగ్‌ను ప్రారంభించనున్నట్లు అధికారులు తెలిపారు. నవంబర్, డిసెంబర్ నెలలకు స్లాట్లు అందుబాటులో ఉంటాయని, గ్రామ, వార్డు సచివాలయాల్లో బుక్ చేసుకోవాలని సూచించారు. ఆయా తేదీల్లో నిర్దేశించిన జిల్లా, బోధనాస్పత్రులకు వెళ్లి వైద్య పరీక్షలకు హాజరుకావాల్సి ఉంటుంది. సదరం సర్టిఫికెట్ల ఆధారంగానే పెన్షన్లకు అర్హత సాధిస్తారు.
Similar News
News November 12, 2025
కర్రపెండలంలో మెగ్నీషియం లోప లక్షణాలు

కర్రపెండలం మొక్కలో మెగ్నీషియం లోపం వల్ల ఆకు ఈనెల మధ్య భాగం పసుపు రంగులోకి మారుతుంది. తీవ్రత ఎక్కువగా ఉంటే పసుపు రంగులోకి మారిన ఆకు భాగాల కణాలు మృతి చెంది గోధుమ రంగులోకి లేదా తెలుపు రంగులోకి మారిపోతాయి. నేలలో పొటాషియం ఎక్కువగా ఉన్నా కూడా మొక్కలలో మెగ్నిషియం లోపం కనిపిస్తుంది. నివారణకు ఎకరాకు 8 కేజీల మెగ్నీషియం సల్ఫేట్ భూమిలో వేసి కప్పాలి. 1% మెగ్నీషియం సల్ఫేట్ మొక్కలపై పిచికారీ చేయాలి.
News November 12, 2025
ఏపీ ఎడ్యుకేషన్&జాబ్స్ న్యూస్

* MBBS బీ, సీ కేటగిరీ సీట్లకు మూడో దశకు కౌన్సెలింగ్‌కు ఇవాళ సా.4 గంటల్లోపు వెబ్‌ఆప్షన్లు నమోదు చేసుకోవాలి.
* జర్మనీకి చెందిన యూరోప్ కెరీర్స్‌తో APSSDC, ఓవర్‌సీస్ మ్యాన్ పవర్ ఒప్పందం చేసుకుంది. ఇందులో భాగంగా యూరోప్ సంస్థ ఏపీ యువతకు జర్మన్ భాషలో శిక్షణ, ఉద్యోగాలను అందిస్తుంది. జాబ్ కాంట్రాక్ట్, వీసా సమకూర్చడానికి సాయం చేస్తుంది.
News November 12, 2025
తగ్గిన బంగారం ధర.. పెరిగిన సిల్వర్ రేట్

గత రెండు రోజులు పెరిగిన గోల్డ్ రేట్స్ ఇవాళ కాస్త తగ్గాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి రూ.330 తగ్గి రూ.1,25,510కి చేరింది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.300 దిగివచ్చి రూ.1,15,050గా నమోదైంది. అటు వెండి ధరలు మరోసారి భారీగా పెరిగాయి. కేజీ సిల్వర్ రేట్ రూ.3వేలు పెరిగి రూ.1,73,000కు చేరింది.


