News August 6, 2024

గ్రూప్-1 మెయిన్స్ రాసే అభ్యర్థులకు గుడ్ న్యూస్

image

TG: గ్రూప్-1 మెయిన్స్ ఎగ్జామ్ రాసే అభ్యర్థుల కోసం టీ-శాట్ క్లాసెస్ ప్రసారం చేయనుంది. దీనికోసం 750 ఎపిసోడ్స్ సిద్ధం చేశామని టీ-శాట్ సీఈవో వేణుగోపాల్ రెడ్డి తెలిపారు. నిపుణ ఛానల్‌లో నేటి నుంచి అక్టోబర్ 19 వరకు సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు ప్రసారం చేస్తామన్నారు. తిరిగి అవే ఎపిసోడ్స్ విద్య ఛానల్‌లో ఉదయం 5 గంటల నుంచి 10 గంటల వరకు టెలికాస్ట్ చేస్తామన్నారు.

Similar News

News December 12, 2025

పొందూరు ఖాదీకి GI ట్యాగ్‌ గుర్తింపు

image

పొందూరు ఖాదీకి ప్రతిష్ఠాత్మక GI ట్యాగ్‌ లభించిందని కేంద్రమంత్రి రామ్మోహన్‌ నాయుడు X వేదికగా ప్రకటించారు. ఇది శ్రీకాకుళం నేతకార్మికుల వారసత్వానికి లభించిన అపూర్వ గౌరవమని తెలిపారు. గాంధీజీకి ప్రియమైన పొందూరు ఖాదీ ప్రతి నూలు పోగులో తరాల చరిత్ర ఉందని, ఎన్నో కష్టాల మధ్య ఈ కళను కాపాడిన నేతకార్మికులే ఈ విజయానికి కారణమని పేర్కొన్నారు. GI ట్యాగ్‌తో ఖాదీ మార్కెట్‌ మరింత పెరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

News December 12, 2025

T20ల్లో వరల్డ్ రికార్డ్.. ఒకే మ్యాచ్‌లో 7 వికెట్లు

image

T20I క్రికెట్‌లో 33ఏళ్ల బహ్రెయిన్ బౌలర్ అలీ దావూద్ ప్రపంచ రికార్డు సృష్టించారు. భూటాన్‌పై కేవలం 19 పరుగులే ఇచ్చి 7 వికెట్లు తీశారు. టీ20 చరిత్రలో ఇదే సెకండ్ బెస్ట్ స్టాట్స్. ఫస్ట్ ప్లేస్‌లో మలేషియాకు చెందిన స్యాజ్రుల్ ఇద్రుస్(7/8), మూడో స్థానంలో సింగపూర్‌ ప్లేయర్ హర్షా భరద్వాజ్(6/3), ఫోర్త్ ప్లేస్‌లో నైజీరియా బౌలర్ పీటర్ అహో(6/5), ఐదో స్థానంలో టీమ్ ఇండియా బౌలర్ దీపక్ చాహర్(6/7) ఉన్నారు.

News December 12, 2025

పాకిస్థాన్‌లో సంస్కృతం, మహాభారతం కోర్సులు

image

పాకిస్థాన్‌లోని లాహోర్‌ యూనివర్సిటీ ఆఫ్‌ మేనేజ్‌మెంట్‌ సైన్సెస్‌లో (LUMS) సంస్కృతాన్ని అధికారిక కోర్సుగా ప్రారంభిస్తున్నారు. దీంతో పాటు మహాభారతం, భగవద్గీత శ్లోకాలను సైతం విద్యార్థులకు పరిచయం చేయనున్నారు. అయితే దీని వెనుక ప్రొఫెసర్‌ షాహిద్‌ రషీద్‌ కృషి ఉంది. రాబోయే 10-15 ఏళ్లలో పాకిస్థాన్‌ నుంచి భగవద్గీత, మహాభారతానికి చెందిన స్కాలర్లు వస్తారని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.