News March 28, 2024

టెట్ అభ్యర్థులకు గుడ్ న్యూస్?

image

TG: రాష్ట్రంలోని టెట్ అభ్యర్థులకు ప్రభుత్వం శుభవార్త చెప్పనున్నట్లు తెలుస్తోంది. ఇటీవల పెంచిన టెట్ ఫీజును తగ్గించనున్నట్లు సమాచారం. ఫీజుల పెంపు వ్యవహారం సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి వెళ్లడంతో ఆయన తగ్గించాలని భావిస్తున్నట్లు సమాచారం. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. గతంలో ఒక పేపర్‌కు రూ.200 ఉండగా రూ.1000, రెండు పేపర్లకు రూ.300 ఉండగా రూ.2000 వరకు పెంచారు. దాదాపు 3 లక్షల మంది టెట్ రాయనున్నారు.

Similar News

News February 18, 2026

ఫిబ్రవరి 18: చరిత్రలో ఈరోజు

image

1745: బ్యాటరీ ఆవిష్కర్త అలెస్సాండ్రో వోల్టా జననం
1836: ఆధ్యాత్మిక గురువు రామకృష్ణ పరమహంస జననం (ఫొటోలో)
1939: ఆంధ్రసభ స్థాపకుడు, సంఘ సంస్కర్త భాగ్యరెడ్డి వర్మ మరణం
2002: ఒలింపిక్ మెడలిస్ట్ షూటర్ మనూ భాకర్ జననం
2014: ఉమ్మడి ఆంధ్ర రాష్ట్ర విభజన బిల్లుకు లోక్‌సభ ఆమోదం
2015: సినీ నిర్మాత దగ్గుబాటి రామానాయుడు మరణం
2023: నటుడు నందమూరి తారకరత్న మరణం

News February 18, 2026

ప్రముఖ బాలీవుడ్ నటి మృతి

image

ప్రముఖ బాలీవుడ్ నటి ప్రవీణా దేశ్‌పాండే(60) కన్నుమూశారు. క్యాన్సర్‌తో చాలా కాలంగా బాధపడుతున్న ఆమె ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ఈ విషయాన్ని ప్రవీణ కుటుంబ సభ్యులు సోషల్ మీడియాలో వెల్లడించారు. హిందీ, మరాఠీ సినిమాలతోపాటు టీవీ, వెబ్ సిరీసుల్లోనూ ఆమె నటించారు. సల్మాన్‌తో రెడీ మూవీతోపాటు ఏక్ విలన్, పరమాణు తదితర ఎన్నో మూవీల్లో కనిపించారు.

News February 18, 2026

పుట్టిన రోజు శుభాకాంక్షలు

image

ఈ రోజు పుట్టినరోజు జరుపుకొంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపరచండి.