News April 25, 2024

రైలు ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. రూ.20కే భోజనం!

image

రైలు ప్రయాణికులకు భారత రైల్వే గుడ్ న్యూస్ చెప్పింది. కేవలం రూ.20కే భోజనం అందించే పథకాన్ని 100 స్టేషన్లకు పెంచుతున్నట్లు తెలిపింది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 51 స్టేషన్లలో ఈ కార్యక్రమం నడుస్తోంది. రైళ్ల జనరల్ క్లాస్ బోగీలు ఆగే చోట ఈ కౌంటర్లను ఏర్పాటు చేసినట్లు రైల్వే వివరించింది. రూ.20కి భోజనంతో పాటు రూ.50కి స్నాక్స్‌ను పరిశుభ్రంగా, అందరికీ అందుబాటు ధరలో ఇస్తున్నామని ఓ ప్రకటనలో చెప్పింది.

Similar News

News April 15, 2026

విమాన వేంకటేశ్వర స్వామి ఎక్కడ ఉంటారు?

image

విమాన వేంకటేశ్వర స్వామి వారు శ్రీవారి ఆలయంలోని ఆనంద నిలయ గోపురం దక్షిణ భాగంలో దర్శనమిస్తారు. ఈ మూర్తి ఆలయ మూలవిరాట్టులాగే ఉంటుంది. శ్రీవారి భక్తుడైన తొండమాన్ చక్రవర్తి దీనిని ఏర్పాటు చేశారని వేంకటాచల మాహాత్మ్యం చెబుతోంది. భక్తులు సులభంగా దర్శించుకునేందుకు వీలుగా గోపురం వద్ద వెండి మకర తోరణం ఏర్పాటు చేశారు. అలాగే బాణం గుర్తు కూడా ఉంటుంది. ఈ స్వామివారిని దర్శించడం విశేషంగా భావిస్తారు.

డీలిమిటేషన్ బిల్లు.. NDAకు మెజార్టీ ఉందా?

image

మహిళా రిజర్వేషన్, డీలిమిటేషన్ బిల్లుల రాజ్యాంగ సవరణల ఆమోదానికి లోక్‌సభలో 364మంది సభ్యుల మద్దతు అవసరం. NDAకు 293మంది MPలు ఉన్నారు. దీంతో కొన్ని ప్రతిపక్ష పార్టీలను ఒప్పించడానికి, చీల్చడానికి, గైర్హాజరు చేయించడానికి BJP యత్నిస్తోందని కొన్ని పార్టీలు ఆరోపిస్తున్నాయి. ఇక NDA పార్టీలన్నీ తమ MPలకు విప్ జారీ చేశాయి. ఉమెన్ రిజర్వేషన్ బిల్లు నేపథ్యంలో ఆయా పార్టీల మహిళా నేతలను LS గ్యాలరీకి రప్పిస్తున్నారు.