News April 1, 2024
నిరుద్యోగులకు GOOD NEWS: రేపు SSC ఉద్యోగ నోటిఫికేషన్

కంబైన్డ్ హయ్యర్ సెకండరీ(10+2) లెవెల్ ఎగ్జామినేషన్-2024కు SSC షార్ట్ నోటీసు విడుదల చేసింది. దేశవ్యాప్తంగా పలు కేంద్ర ప్రభుత్వ విభాగాల్లో లోయర్ డివిజన్ క్లర్క్, జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్, డేటా ఎంట్రీ ఆపరేటర్ తదితర పోస్టులను భర్తీ చేయనుంది. పోస్టుల సంఖ్య, దరఖాస్తు ప్రక్రియ, అర్హతలు, పరీక్ష తేదీల వివరాలతో రేపు పూర్తిస్థాయి నోటిఫికేషన్‌ను రిలీజ్ చేయనుంది.
వెబ్‌సైట్: <
Similar News
News February 18, 2026
SMలో ‘ఓవర్ షేరింగ్’ వద్దు.. ఈ విషయాలు పోస్ట్ చేస్తే డేంజర్!

SMలో మనం సరదాగా పంచుకునే వివరాలే సైబర్ నేరగాళ్లకు అస్త్రాలుగా మారుతున్నాయి. లైవ్ లొకేషన్, బోర్డింగ్ పాస్, బ్యాంక్ వివరాలు, హోమ్ అడ్రస్, పాన్/ఆధార్, CVV, OTP వంటి కీలక విషయాలను షేర్ చేయొద్దని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇవి ఐడెంటిటీ థెఫ్ట్‌కు దారితీసి మీ పేరిట ఆర్థిక మోసాలకు పాల్పడే అవకాశం ఉంది. ప్రైవసీని కాపాడుకోవడానికి టూ-స్టెప్ వెరిఫికేషన్ వంటి సెక్యూరిటీ మోడ్స్ ఆన్ చేసుకోవాలని సూచిస్తున్నారు.
News February 18, 2026
బొత్సకు ‘హెరిటేజ్’ లీగల్ నోటీసులు

AP: నెయ్యి వివాదంలో వైసీపీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణకు హెరిటేజ్ సంస్థ లీగల్ నోటీసులు పంపింది. అసత్య, నిరాధార ఆరోపణలతో తమ సంస్థ ప్రతిష్ఠను దెబ్బతీసేందుకు కుట్ర చేస్తున్నారని అందులో పేర్కొంది. తప్పుడు ప్రచారంపై సమాధానం చెప్పాలని డిమాండ్ చేసింది. కాగా 2014-19లో తిరుమలకు నెయ్యి సరఫరా చేసిన ఇందాపూర్ డెయిరీతో హెరిటేజ్ చీకటి ఒప్పందం చేసుకుందని బొత్స ఆరోపించారు.
News February 18, 2026
ఎక్కువ సార్లు డకౌట్ అయింది వీరే

అంతర్జాతీయ టీ20ల్లో అత్యధిక సార్లు డకౌట్ అయిన భారత ప్లేయర్లు వీరే:
12- రోహిత్ శర్మ (151 ఇన్నింగ్సులు)
7- విరాట్ కోహ్లీ (117)
7- సంజూ శాంసన్ (50)
6- అభిషేక్ శర్మ (40)
6- సూర్య కుమార్ యాదవ్ (102)
5- అర్ష్‌దీప్ సింగ్ (28)
5- కేఎల్ రాహుల్ (68)


