News August 24, 2024
వాలంటీర్లకు గుడ్ న్యూస్

AP: వాలంటీర్ వ్యవస్థను రద్దు చేసే ఆలోచన ప్రభుత్వానికి లేదని గ్రామ, వార్డు సచివాలయ శాఖ సంచాలకులు శివప్రసాద్ స్పష్టం చేశారు. సాంకేతిక కారణాలతో వాలంటీర్లకు పెండింగ్‌లో ఉన్న 2 నెలల వేతనాలు చెల్లించేందుకు ఆర్థిక శాఖకు నివేదిక పంపినట్లు తెలిపారు. త్వరలో ఆమోదం లభించే అవకాశం ఉందని చెప్పారు. ఉన్నతవిద్య చదివిన వాలంటీర్లకు శిక్షణ ఇచ్చి ఉన్నత స్థానాల్లోకి తీసుకునేందుకు సర్కారు ప్రణాళికలు రూపొందిస్తోందన్నారు.
Similar News
News January 15, 2026
ADB: బీజేపీ సెగ్మెంట్లపై కాంగ్రెస్ నేతల గురి!

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో మంచిర్యాల కార్పొరేషన్‌తో సహా 11 మున్సిపాలిటీలు ఉన్నాయి. బీజేపీ నుంచి ఆదిలాబాద్ పార్లమెంటు స్థానంతో పాటు ఆదిలాబాద్, నిర్మల్, కాగజ్‌నగర్, ముధోల్ నియోజకవర్గాల్లో బీజేపీ ఎమ్మెల్యేలు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అక్కడ కాంగ్రెస్ పార్టీ విజయతీరాలకు చేరాలంటే కష్టపడాల్సి వస్తుంది.
News January 15, 2026
దావోస్‌లో CM ‘పవర్’ ఫుల్ ప్లాన్ ఇదే!

వర్షం పడితే చాలు కరెంటు పోతుందా? ఫ్యూచర్ సిటీలో గాలి వాన వచ్చినా సరే ఒక్క రెప్పపాటు కాలం కూడా కరెంటు పోని ‘అన్‌ఇంటరప్టెడ్’ ప్లాన్ ఉంది. CM దావోస్ ప్రపంచ ఆర్థిక వేదికపై ఆవిష్కరించబోయే అత్యంత కీలకమైన అంశం ఈ “స్మార్ట్ మైక్రో-గ్రిడ్స్”. సోలార్, విండ్, బ్యాటరీ స్టోరేజ్ టెక్నాలజీతో ఇది పని చేస్తుంది. మెయిన్ పవర్ లైన్ తెగిపోయినా సెకనులో ఈ మైక్రో-గ్రిడ్ యాక్టివేట్ అవుతుంది. దీనివల్ల జనరేటర్ల అవసరం ఉండదు.
News January 15, 2026
అమెరికా సంచలన నిర్ణయం.. పాకిస్థాన్‌కు షాక్

అగ్రరాజ్యం అమెరికా మరో కీలక నిర్ణయం తీసుకుంది. జనవరి 21 నుంచి 75 దేశాల పౌరులకు వీసా ప్రాసెసింగ్‌ను పూర్తిగా నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. అక్రమ వలసలను నియంత్రించడమే లక్ష్యంగా చర్యలు చేపట్టినట్లు వెల్లడించింది. ఈ జాబితాలో పాకిస్థాన్, బ్రెజిల్, రష్యా, ఇరాన్, సోమాలియా, అఫ్గానిస్థాన్ సహా అనేక దేశాలు ఉన్నాయి. గత కొంత కాలంగా USతో సన్నిహితంగా ఉంటున్న పాక్‌కు ఈ నిర్ణయం పెద్ద షాక్ అనే చెప్పుకోవచ్చు.


