News August 25, 2024

స్కూళ్లకు ప్రభుత్వం కీలక ఆదేశాలు

image

AP: విద్యార్థుల డేటాను <>యూడైస్ ప్లస్<<>> వెబ్‌సైటులో నమోదు చేయాలని స్కూళ్లను విద్యాశాఖ ఆదేశించింది. ప్రతి విద్యార్థిని ట్రాక్ చేసేలా డేటా నమోదు ఉండాలని DEOలు, MEOలు, HMలు, టీచర్లకు సూచించింది. సెప్టెంబర్ 6వ తేదీలోగా విద్యార్థుల డేటాను నమోదు చేయాలని స్పష్టం చేసింది. ఈ డేటా ఆధారంగా మధ్యాహ్న భోజనం, అల్పాహారం, ఏకరూప దుస్తులు, పుస్తకాలు, స్కాలర్‌షిప్, రవాణా భత్యం వంటి వాటికి కేంద్రం బడ్జెట్ కేటాయించనుంది.

Similar News

News January 20, 2026

ఖమ్మంలో పూడ్చిపెట్టిన మహిళ మృతదేహానికి పోస్టుమార్టం

image

ఖమ్మం రమణగుట్టలో సంచలనం రేపిన శైలజ(26) మరణంపై పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. అనారోగ్యంతో మరణించిందని నమ్మించి భర్త సురేందర్ హడావుడిగా అంత్యక్రియలు నిర్వహించగా, అనుమానం వచ్చిన మృతురాలి తల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. తహశీల్దార్ పర్యవేక్షణలో సోమవారం మృతదేహాన్ని వెలికితీసి పోస్టుమార్టం నిర్వహించారు. వివాహేతర సంబంధం కోసమే ఇంజెక్షన్‌తో భార్యను హతమార్చినట్లు ఆరోపణలు వస్తున్నాయి.

News January 20, 2026

ఆర్సీబీ సరికొత్త చరిత్ర

image

WPLలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు సరికొత్త చరిత్ర సృష్టించింది. టోర్నీలో వరుసగా 6 మ్యాచులు గెలిచిన ఏకైక జట్టుగా నిలిచింది. గత సీజన్‌‌లో RCB తన చివరి మ్యాచ్‌లో గెలవగా ఈసారి వరుసగా ఐదు విజయాలు ఖాతాలో వేసుకుంది. ఈ క్రమంలో 2024లో తొలి ట్రోఫీని గెలుచుకున్న స్మృతి సేన మరోసారి టైటిల్‌పై కన్నేసింది. నిన్న గుజరాత్‌తో మ్యాచులో విజయంతో ఆర్సీబీ ప్లే ఆఫ్‌కు అర్హత సాధించిన సంగతి తెలిసిందే.

News January 20, 2026

ఏ బాటిల్‌లో నీటిని నిల్వ చేస్తున్నారు?

image

తాగే నీటిని నిల్వ చేసే సీసా కూడా రుచిని ప్రభావితం చేస్తుందని పరిశోధకులు చెబుతున్నారు. రాగి సీసాలో 16 గంటల పాటు నీటిని నిల్వ ఉంచి తాగితే శరీరానికి మేలు చేస్తుంది. అయితే వీటిలో నిమ్మరసం వంటివి నిల్వ చేయకూడదు. గాజు సీసా నిల్వకు ఉత్తమం. ఇందులో ఎలాంటి రసాయనచర్యలు ఉండవు. తేలికగా ఉంటాయని వాడే ప్లాస్టిక్ బాటిల్స్ ఆరోగ్యానికి ప్రమాదకరం. ముఖ్యంగా పాతబడ్డవి వాడకపోవడం మేలు.