News December 1, 2025
GP ఎలక్షన్స్.. కళాకారుల AWARENESS ఎక్కడ..?

GP ఎన్నికల వేళ ఓటుకున్న ప్రాధాన్యతపై సాంస్కృతిక శాఖ అవగాహన ప్రోగ్రాంలు చేపట్టకపోవడంపై విమర్శలొస్తున్నాయి. కాగా TG ఉద్యమంలో కీలకంగా వ్యవహరించిన కళాకారులకు కల్చరల్ శాఖ ద్వారా నియామకాలు చేపట్టింది. వీరు ప్రభుత్వ సంక్షేమ పథకాలు, సామాజిక అంశాలపై ప్రజలకు అవగాహన కల్పించాలి. ఉమ్మడి KNRలో 35మంది వరకు కళాకారులుండగా వీరికి కార్యక్రమాలు రూపొందించడంలో సంబంధిత శాఖ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందన్న టాక్ నడుస్తోంది.
Similar News
News February 16, 2026
GNT: శివరాత్రి వేళ ప్రత్యేక ఆకర్షణగా ‘పొట్టేళ్ల ప్రభ’

మహాశివరాత్రిని పురస్కరించుకొని పొన్నూరులో ఆదివారం సాయంత్రం నిర్వహించిన పొట్టేళ్ల ప్రభ భక్తులను విశేషంగా ఆకట్టుకుంది. తెలగపాలెంకు చెందిన బోడి రామారావు కుటుంబం గత 13 ఏళ్లుగా పొట్టేళ్లను ప్రత్యేకంగా పెంచి, ఈ ప్రభను సిద్ధం చేస్తోంది. సంప్రదాయం ప్రకారం పొన్నూరు నుంచి కట్టెంపూడిలోని సంగమేశ్వరస్వామి ఆలయం వరకు ఈ ప్రభను ప్రదర్శనగా తీసుకెళ్లారు. ఈ అపురూప దృశ్యాన్ని చూసేందుకు ప్రజలు భారీగా తరలివచ్చారు.

BREAKING: కడ్తాల్ వద్ద రెండు కార్లు ఢీ.. ఇద్దరి దుర్మరణం

కడ్తాల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కర్కల్ పహాడ్ గేట్ సమీపంలో ఆదివారం రాత్రి ప్రమాదం జరిగింది. NH 765పై రెండు కార్లు ఒకదానిని మరొకటి ఢీకొన్నాయి. ఈ ఘటనలో కార్లలో ప్రయాణిస్తున్న నరేంద్ర చారి (37), ఎస్‌కే సైదులు (30) అక్కడికక్కడే మృతి చెందారు. మరో వ్యక్తి పరిస్థితి విషమంగా ఉండటంతో చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.