News May 13, 2024
GREAT.. ఓటు వేయడానికి అమెరికా నుంచి వచ్చాడు..!

సిద్దిపేట జిల్లా యువకుడు ఓటు వేయడానికి అమెరికా నుంచి వచ్చాడు. రాయపోలు మండలం వడ్డేపల్లికి చెందిన బచ్చు శ్రావణ్ కుమార్ ఉన్నత చదువు కోసం అమెరికా వెళ్లాడు. తాజా ఎంపీ ఎన్నికల్లో తన ఓటు హక్కును వినియోగించుకోవాలన్న సంకల్పంతో శనివారం స్వగ్రామానికి వచ్చారు. ‘ప్రజాస్వామ్యంలో అత్యంత విలువైన ఓటు హక్కును వినియోగించుకోవడానికి వచ్చానని, అన్ని విధాల ఆలోచించి మంచి వారికి ఓటేస్తా’ అని శ్రావణ్ అంటున్నారు.
Similar News
News December 9, 2025
మెదక్ : సభలు, ర్యాలీలపై నిషేధం: కలెక్టర్

గ్రామ పంచాయతీ తొలి విడత ఎన్నికల ప్రచారం 9 సాయంత్రం 5 గంటలకు ముగుస్తుందని కలెక్టర్ రాహుల్ రాజ్ తెలిపారు. పోలింగ్‌కు 44 గంటల ముందు సైలెన్స్ పీరియడ్ అమలులోకి రానుంది. ఈ సమయంలో సభలు, ర్యాలీలు, ఊరేగింపులు, ప్రచారాలు నిషేధం. ఇతర ప్రాంతాల వారు పంచాయతీ పరిధిలో ఉండరాదు. ఉల్లంఘనలు గమనిస్తే వెంటనే చర్యలు తీసుకోవాలని అధికారులు ఆదేశించారు.
News December 9, 2025
మెదక్: నేడు 5 గంటల వరకే ప్రచారం: కలెక్టర్

గ్రామ పంచాయతీ మెదటి విడత ఎన్నికల ప్రచారం నేడు సాయంత్రం 5 గంటలకు తెరపడనున్నట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ రాహుల్ రాజ్ తెలిపారు. పోలింగ్ ముగియడానికి 44 గంటల ముందు నుంచి ఆయా మండలాల్లో సైలెన్స్ పీరియడ్ అమలులోకి వస్తుందని తెలిపారు. పోలింగ్ ముగిసే వరకు ఎలాంటి బహిరంగ సభలు, ర్యాలీలు, ఊరేగింపులు, ఏ విధమైన ప్రచారాలు నిర్వహించరాదని ఆయన స్పష్టం చేశారు. బయట నుంచి వచ్చిన వ్యక్తులు వెళ్లాలన్నారు.