News November 15, 2024

GREAT: చనిపోతూ నలుగురికి ప్రాణం పోశాడు

image

AP: రోడ్డు ప్రమాదంలో బ్రెయిన్ డెడ్ అయిన కొడుకు అవయవాలు దానం చేసి పేరెంట్స్ నలుగురి ప్రాణాలు కాపాడారు. ఈ ఘటన విజయనగరంలో జరిగింది. మన్యం(D) కొత్తవలసకు చెందిన సాయికుమార్(22) బైక్‌పై ఇంటికొస్తూ కింద పడ్డారు. తీవ్ర గాయాలపాలైన అతడిని VZM ఆస్పత్రికి తీసుకెళ్లగా బ్రెయిన్ డెడ్ అయినట్లు వైద్యులు ప్రకటించారు. తల్లిదండ్రుల సమ్మతితో కాలేయం, కిడ్నీలు, ఊపిరితిత్తులను విశాఖకు తరలించి నలుగురికి అమర్చారు.

Similar News

News April 17, 2026

అంబానీని దాటేసి.. ఆసియా కుబేరుడిగా అదానీ

image

గౌతమ్ అదానీ మరోసారి ఆసియాలోనే అత్యంత ధనవంతుడిగా అవతరించారు. బ్లూమ్‌బర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ ప్రకారం ముకేశ్ అంబానీని వెనక్కి నెట్టి ఆయన అగ్రస్థానానికి చేరుకున్నారు. ప్రస్తుతం అదానీ నెట్‌వర్త్ $92.6 బిలియన్లుగా ఉండగా, అంబానీ ఆస్తి $90.8 బిలియన్లుగా నమోదైంది. ప్రపంచ కుబేరుల జాబితాలో అదానీ 19వ స్థానంలో, అంబానీ 20వ స్థానంలో ఉన్నారు. ప్రపంచంలో అత్యంత సంపన్న వ్యక్తిగా మస్క్ ($656B) కొనసాగుతున్నారు.

News April 17, 2026

పండ్లు తింటున్నారా? FSSAI వార్నింగ్!

image

మామిడి, అరటి, బొప్పాయి వంటి పండ్లను కృత్రిమంగా పండించేందుకు ‘మసాలా’ (కాల్షియం కార్బైడ్) వాడకంపై FSSAI కఠిన చర్యలు చేపట్టింది. ఈ రసాయనం వల్ల చర్మ వ్యాధులు, గొంతు సమస్యలు, వాంతులు వచ్చే ప్రమాదం ఉండటంతో తనిఖీలు చేపట్టాలని రాష్ట్రాలను ఆదేశించింది. ఇథిలీన్ ద్రావణంలో పండ్లను ముంచడం కూడా నిబంధనలకు విరుద్ధమని స్పష్టం చేసింది. నిబంధనలు ఉల్లంఘించే వ్యాపారులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేసింది.

News April 17, 2026

అనుమతి లేకుండా అల్లు అర్జున్ పేరు, ఫొటో వాడొద్దు: ఢిల్లీ హైకోర్టు

image

అల్లు అర్జున్ వ్యక్తిత్వ హక్కులను (Personality Rights) పరిరక్షిస్తూ ఢిల్లీ హైకోర్టు <<19671551>>ఉత్తర్వులు<<>> జారీ చేసింది. ఆయన అనుమతి లేకుండా పేరు, వాయిస్, ఫొటోలు, సంతకాన్ని వాణిజ్య ప్రయోజనాల కోసం వాడకూడదని స్పష్టం చేసింది. డీప్‌ఫేక్, AI టెక్నాలజీతో తన వాయిస్‌ని క్లోనింగ్ చేయడం, ఫొటోలను మార్ఫింగ్ చేయడం వంటివి తన బ్రాండ్ విలువను, ప్రతిష్ఠను దెబ్బతీస్తాయని ఆయన కోర్టును ఆశ్రయించగా ఇలా స్పందించింది.