News February 8, 2025
GREAT.. WGL: ఆశ్రమంలోనే అనాథల మధ్య పెళ్లి వేడుక

వరంగల్ జిల్లా గీసుగొండ మండలం ఎలుకుర్తి హవేలీకి చెందిన అల్లూరి రంజిత్ రెడ్డి MBA పూర్తి చేసి ల్యాండ్ సర్వేయర్‌గా పని చేస్తున్నారు. ఆయన జనగామ జిల్లా జఫర్‌గడ్ మండలంలో “మా ఇల్లు ఆశ్రమం”లో అనాథగా పెరిగిన విజేతను పెళ్లి చేసుకోవడానికి ముందుకు వచ్చారు. ఈ సందర్భంగా ఆశ్రమంలోనే అనాథల మధ్య పెళ్లి వేడుక ఎంతో వైభవంగా నిర్వహించారు. వీరికి పలువురు శుభాకాంక్షలు తెలియజేశారు.
Similar News
News February 13, 2026
మంచిర్యాల కార్పొరేషన్‌లో కాంగ్రెస్ విజయం

TG: మంచిర్యాల కార్పొరేషన్‌ను కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది. 60 డివిజన్లలో 45 స్థానాలను సొంతం చేసుకుంది. BRS 5, BJP ఒక డివిజన్‌లో గెలుపొందాయి. అటు నల్గొండ, మహబూబ్‌నగర్, రామగుండంలోనూ కాంగ్రెస్ ఆధిక్యంలో కొనసాగుతోంది. కరీంనగర్, నిజామాబాద్‌లో బీజేపీ లీడ్‌లో ఉంది. BRS ఒక్క కార్పొరేషన్‌లోనూ సత్తా చాటలేకపోతోంది.
News February 13, 2026
కార్మిక సంక్షేమశాఖ ఆదాయం, ఈ-శ్రమ అమలు తీరుపై సమీక్ష

కార్మిక సంక్షేమశాఖకు వచ్చిన పన్నుల వసూళ్లు, ఈ-శ్రమ పోర్టల్ అమలు తీరుపై బాపట్ల కలెక్టర్ కార్యాలయంలో జిల్లా స్థాయి కమిటీ సమావేశం శుక్రవారం నిర్వహించారు. ఈ సమావేశంలో కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ సంబంధిత అధికారులతో సమీక్షించారు. శాఖకు సంబంధించిన ఆదాయ వనరులు, పెండింగ్ వసూళ్లు, ఈ-శ్రమ పోర్టల్‌లో కార్మికుల నమోదు పురోగతి, అమలు ప్రక్రియలో ఎదురవుతున్న సమస్యలపై చర్చించారు.
News February 13, 2026
తూప్రాన్: సమంగా ఓట్లు.. డ్రా

తూప్రాన్ మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో బీఆర్ఎస్ మరో విజయం నమోదైంది. మున్సిపాలిటీలోని 3వ వార్డులో బీఆర్ఎస్ అభ్యర్థి సత్య లింగం, స్వతంత్ర అభ్యర్థి కృష్ణ పై గెలుపొందారు. ఇరువురికి సమంగా 330 ఓట్లు రాగా, డ్రా నిర్వహించారు. డ్రాలో సత్య లింగం గెలుపొందారు. బీఆర్ఎస్ శ్రేణుల్లో ఉత్సాహం నెలకొంది. లెక్కింపు కేంద్రం వద్ద గులాబీ కార్యకర్తలు సంబరాలు మొదలుపెట్టారు.


