News March 11, 2025
నేడు గ్రూప్-2 ఫలితాలు

TG: నేడు గ్రూప్-2 ఫలితాలను టీజీపీఎస్సీ వెల్లడించనుంది. 783 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇక 1,363 గ్రూప్-3 పోస్టులకు సంబంధించి ఫలితాలను ఈ నెల 14న విడుదల చేయనుంది. మార్చి 17న హాస్టల్ వెల్ఫేర్, 19న ఎక్స్ టెన్షన్ ఆఫీసర్ ఫలితాలను రిలీజ్ చేస్తామని టీజీపీఎస్సీ తెలిపింది.
Similar News
News January 16, 2026
మేడారం జాతరకు వెళ్తున్నారా? ఇవి చూసేయండి!

పర్యాటక ప్రాంతాలకు ములుగు జిల్లా నెలవుగా మారింది. మరి కొద్ది రోజుల్లో సమ్మక్క-సారలమ్మ జాతర ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో జిల్లాకు వచ్చే భక్తులు గట్టమతల్లి, రామప్ప, లక్నవరం, బ్లాక్ బెర్రీ, దట్టమైన ఏటూరునాగారం అభయారణ్యం, తాడ్వాయి హాట్స్‌తో పాటు మల్లూరు లక్ష్మీనరసింహ స్వామిని సైతం దర్శించుకోవచ్చు. ప్రధానంగా హైదరాబాద్, వరంగల్ మీదుగా వచ్చే భక్తులకు ఈ ప్రాంతాలు సందర్శించేందుకు సౌకర్యంగా ఉంటాయి.
News January 16, 2026
బంపరాఫర్.. లేఖ రాస్తే రూ.50వేలు, స్విట్జర్లాండ్ పర్యటన!

విద్యార్థులకు CBSE రైటింగ్ కాంపిటేషన్ ప్రకటించింది. డిజిటల్ యుగంలో మానవ సంబంధాలు ఎంత ముఖ్యమో వివరిస్తూ స్నేహితుడికి లేఖ రాయాలని తెలిపింది. 9-15 ఏళ్ల విద్యార్థులను అర్హులుగా పేర్కొంటూ మార్చి 20లోపు స్కూళ్లు రిపోర్టులు సమర్పిస్తే విజేతలను ఎంపిక చేస్తామంది. విజేతలకు సర్కిల్, జాతీయ స్థాయిలో రూ.5-50వేలు ఇవ్వనున్నట్లు వెల్లడించింది. జాతీయ స్థాయిలో విజేతకు స్విట్జర్లాండ్ పర్యటనకు ఛాన్స్ ఇస్తామంది.
News January 16, 2026
TODAY HEADLINES

⭒ తెలుగు రాష్ట్రాల్లో ఘనంగా సంక్రాంతి వేడుకలు
⭒ మెగా సిటీలుగా తిరుపతి, విశాఖ, అమరావతి: CM CBN
⭒ దేశ భద్రత విషయంలో TG ముందుంటుంది.. ఆర్మీ అధికారులతో CM రేవంత్
⭒ రాయలసీమ లిఫ్ట్‌ను KCRకు జగన్ తాకట్టు పెట్టారు: సోమిరెడ్డి
⭒ TG: ఎమ్మెల్యేలు కాలె యాదయ్య, పోచారం శ్రీనివాస్‌కు స్పీకర్ క్లీన్ చిట్
⭒ BMCలో బీజేపీదే హవా.. ఎగ్జిట్ పోల్స్ అంచనా
⭒ U19 WC: USAపై IND గెలుపు


