News August 21, 2025

GSTలో రెండు శ్లాబులకు మంత్రుల బృందం ఓకే

image

GSTలో <<17416480>>రెండు శ్లాబుల<<>> ప్రతిపాదనను మంత్రుల బృందం ఆమోదించింది. ప్రస్తుతం జీఎస్టీలో 4 శ్లాబులు ఉండగా వాటిని రెండుకు (5%, 18%) కుదిస్తూ ఇటీవల కేంద్ర ఆర్థికశాఖ మంత్రుల బృందానికి ప్రతిపాదన పంపింది. దీనికి జీఎస్టీ మండలి కూడా ఆమోదం తెలిపితే రెండు శ్లాబుల విధానం దేశమంతటా అమలులోకి వస్తుంది. కొత్త విధానంలో 12%, 28% శ్లాబ్స్ ఉండవు. దీనివల్ల ఆటోమొబైల్, నిత్యావసరాల ధరలు భారీగా తగ్గనున్నాయి.

Similar News

News January 24, 2026

ESIC ఢిల్లీలో ఉద్యోగాలు

image

<>ESIC <<>>ఢిల్లీ 45 సీనియర్ రెసిడెంట్ పోస్టులను భర్తీ చేయనుంది. అర్హత గల అభ్యర్థులు జనవరి 30న ఇంటర్వ్యూకు హాజరుకావచ్చు. పోస్టును బట్టి MBBS, MCh/DM, పీజీ డిప్లొమా అర్హతతో పాటు పని అనుభవం ఉండాలి. అభ్యర్థుల గరిష్ఠ వయసు 45ఏళ్లు. ఫుల్ టైమ్ స్పెషలిస్టుకు 69 ఏళ్లు. రిజర్వేషన్ గలవారికి ఏజ్‌లో సడలింపు ఉంది. దరఖాస్తు ఫీజు రూ.500. SC, ST, PwBDలకు ఫీజు లేదు. వెబ్‌సైట్: https://esic.gov.in/

News January 24, 2026

భార్య సూచననే పాటించా: సూర్య కుమార్

image

468 రోజుల తర్వాత <<18940538>>అర్ధసెంచరీ<<>> చేసిన సూర్యకుమార్ యాదవ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాను తిరిగి ఫామ్‌లోకి రావడానికి భార్య దేవిషా ఇచ్చిన సలహానే కారణమని చెప్పారు. క్రీజులో కుదురుకునేందుకు కాస్త సమయం తీసుకోమని ఆమె సూచించినట్లు తెలిపారు. న్యూజిలాండ్‌తో ఆడిన రెండు టీ20ల్లో ఇదే పాటించానని SKY పేర్కొన్నారు. నిన్నటి మ్యాచులో 37 బంతుల్లో 82 రన్స్‌తో అదరగొట్టిన సంగతి తెలిసిందే.

News January 24, 2026

ఇండియన్ బ్యాంక్‌లో ఉద్యోగాలు

image

ఇండియన్ బ్యాంక్ సెల్ఫ్ ఎంప్లాయిమెంట్ ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూట్ 6 పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. పోస్టును బట్టి డిగ్రీ(BA, B.Com, BSc, BSW), MA, MSW, టెన్త్ అర్హతతో పాటు పని అనుభవం గలవారు JAN 26 వరకు అప్లై చేసుకోవచ్చు. వయసు 22 -40ఏళ్ల మధ్య ఉండాలి. రాత పరీక్ష, డెమాన్‌స్ట్రేషన్/ప్రజెంటేషన్(ఫ్యాకల్టీ), ఇంటర్వ్యూ, DV ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: https://indianbank.bank.in