News February 18, 2025
బీజేపీతో గుజరాత్ బంధం విడదీయరానిది: PM

గుజరాత్ మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించడం పట్ల PM మోదీ హర్షం వ్యక్తం చేశారు. బీజేపీతో గుజరాత్ బంధం విడదీయరానిదని, ఇది మరింత బలపడుతోందని తెలిపారు. అభివృద్ధి రాజకీయాలకు ఇది పెద్ద విజయం అని అభివర్ణించారు. GJలో 1912 వార్డులకు గాను బీజేపీ 1402, కాంగ్రెస్ 260, ఎస్పీ, ఆప్ కలిసి 236 వార్డులు గెలుచుకున్నాయి. 68 మున్సిపాలిటీల్లో బీజేపీ 57, కాంగ్రెస్ 1, ఎస్పీ 2, ఇతరులు 3 చోట్ల విజయం సాధించాయి.
Similar News
News April 14, 2026
1,000 లోకల్ బ్యాంక్ ఆఫీసర్స్ ఉద్యోగాలు

పంజాబ్&సింధ్ బ్యాంకులో 1,000 లోకల్ బ్యాంక్ ఆఫీసర్స్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదలైంది. TGలో 30 పోస్టులున్నాయి. డిగ్రీ ఉత్తీర్ణత, ఏదైనా బ్యాంకులో 18 నెలల పని అనుభవం ఉండాలి. సంబంధిత రాష్ట్రంలోని లోకల్ లాంగ్వేజ్ వచ్చి ఉండాలి. వయసు 20-30 ఏళ్ల మధ్య ఉండాలి. రాత పరీక్ష, ఇంటర్వ్యూ, లాంగ్వేజ్ టెస్ట్ ఆధారంగా ఎంపిక చేస్తారు. దరఖాస్తుకు చివరి తేదీ APR 20. మరిన్ని వివరాలకు punjabandsind.bank.in చూడండి.
News April 14, 2026
BSNLలో 120 పోస్టులు.. దరఖాస్తుకు రేపే ఆఖరు

BSNLలో 120 Sr. ఎగ్జిక్యూటివ్ ట్రైనీ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి రేపే ఆఖరు తేదీ. పోస్టును బట్టి BE/BTech (EE & టెలికమ్యూనికేషన్స్/ఎలక్ట్రానిక్స్/CS/IT/ఎలక్ట్రికల్/ఇన్‌స్ట్రుమెంటేషన్), CA/CMA అర్హత గల వారు అప్లై చేసుకోవచ్చు. దరఖాస్తు సవరణకు ఏప్రిల్ 16-23 వరకు అవకాశం ఉంటుంది. వయసు 21-30 ఏళ్ల మధ్య ఉండాలి. పరీక్ష తేదీని త్వరలో ప్రకటిస్తారు. మరిన్ని వివరాలకు వెబ్‌సైట్: bsnl.co.in చూడండి.
News April 14, 2026
ఆర్టీసీ ప్రయాణికులకు శుభవార్త.. ఛార్జీలు తగ్గింపు!

ఏపీలో తిరిగే తెలంగాణ ఆర్టీసీ బస్సుల్లో ఛార్జీలను సవరించినట్లు అధికారులు తెలిపారు. గతంలో TG బస్సుల్లో దూరాన్ని బట్టి ఛార్జీలు రూ.20-130 అధికంగా ఉండేవి. ఇకపై వాటిని తగ్గించి APSRTC ఛార్జీల మేరకే వసూలు చేయనున్నారు. హైదరాబాద్ నుంచి రోజూ విజయవాడ, తిరుపతి, కర్నూలు, విశాఖకు వందలాది తెలంగాణ బస్సులు నడుస్తున్న విషయం తెలిసిందే.


