News April 22, 2024
చరిత్ర సృష్టించిన గుకేశ్!

భారత చెస్ గ్రాండ్ మాస్టర్ గుకేశ్ దొమ్మరాజు చరిత్ర సృష్టించారు. ప్రతిష్ఠాత్మక క్యాండిడేట్స్ టోర్నమెంట్‌ను గెలిచిన అత్యంత పిన్న వయస్కుడిగా నిలిచారు. ఈక్రమంలో ఈ ఏడాది జరిగే ప్రపంచ ఛాంపియన్‌షిప్‌కు అర్హత సాధించారు. ఆ టోర్నీలో ప్రస్తుత వరల్డ్ ఛాంపియన్ డింగ్ లిరెన్‌తో గుకేశ్ తలపడనున్నారు. ఈ యువ ఆటగాడు చెస్ దిగ్గజం విశ్వనాథన్ ఆనంద్ వద్ద శిక్షణ తీసుకోవడం గమనార్హం.
Similar News
News December 10, 2025
ఢిల్లీ కంటోన్మెంట్ బోర్డ్‌లో ఉద్యోగాలకు నోటిఫికేషన్

<
News December 10, 2025
వేరుశనగలో సాగుకు అనువైన అంతర పంటలు

వేరుశనగలో కంది, అనప, జొన్న, సజ్జ వంటివి అంతర పంటలుగా సాగుకు అనుకూలం. ఇవి పొడవైన వేరువ్యవస్థ కలిగి భూమి లోపలిపొరల నుంచి నీటిని తీసుకొని బెట్ట పరిస్థితులను సైతం తట్టుకునే శక్తిని కలిగి ఉంటాయి. ఇవి వేరుశనగ పంటతో పాటు నీడ, నీరు, పోషకాల విషయంలో పోటీపడవు. కంది, అనప పంటలైతే 6-7 వేరుశనగ వరుసల తర్వాత ఒక వరుసగా.. జొన్న, సజ్జ పంటలైతే 6 వేరుశనగ మొక్కల వరుసల తర్వాత 2 వరుసలుగా నాటి సాగుచేసుకోవచ్చు.
News December 10, 2025
SKY..WHY?

IND టీ20 కెప్టెన్ సూర్య గత కొంతకాలంగా బ్యాటుతో రాణించలేకపోతున్నారు. ఒక్క ఫార్మాట్‌కే పరిమితమైన ఈ హిట్టర్ స్థాయికి తగ్గట్లుగా ఆడకపోవడంపై విమర్శలొస్తున్నాయి. గత 19 ఇన్నింగ్స్‌లలో 13.47Avg, 119.35 స్ట్రైక్ రేటుతో 222 రన్స్ చేశారు. ఇందులో 11 ఇన్నింగ్స్‌లలో ఆయన స్కోర్ 10లోపే ఉంది. నిన్న SAతో తొలి T20లో 12 రన్స్ చేశారు. కెప్టెన్సీ వల్లే SKY బ్యాటింగ్‌లో ఫెయిలవుతున్నారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.


