News August 20, 2025

GWL: ‘ఏటీసీ ప్రవేశాలకు దరఖాస్తు చేసుకోండి’

image

జిల్లాలోని నిరుద్యోగ యువత అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్ల ప్రవేశాలకు దరఖాస్తు చేసుకోవాలని కలెక్టర్ సంతోష్ బుధవారం ప్రకటనలో పేర్కొన్నారు. నిరుద్యోగులకు మెరుగైన ఉద్యోగ అవకాశాలు కల్పించాలని ఉద్దేశంతో ITIలను ప్రభుత్వం ఏటీసీ సెంటర్లుగా అప్ గ్రేడు చేసిందన్నారు. ఈనెల 28 లోపు దరఖాస్తు చేసుకోవాలన్నారు. అభ్యర్థులు ఆన్ లైన్ లేదా ప్రభుత్వ ఐటీఐ కాలేజీలో సంప్రదించాలన్నారు. పలు విభాగాల్లో సీట్లు ఉన్నాయని తెలిపారు.

Similar News

News January 21, 2026

పట్టాదారు పాసు పుస్తకాల ప్రక్రియను పరిశీలించిన కలెక్టర్

image

పరిగి మండలంలో జరుగుతున్న డ్రాఫ్ట్ పట్టాదారు పాసు పుస్తకాల పరిశీలనను జిల్లా కలెక్టర్ శ్యాంప్రసాద్ బుధవారం తనిఖీ చేశారు. రీ సర్వే పూర్తయిన హుస్సేన్ బి అనే మహిళకు ఈ-కేవైసీ పూర్తి చేసి డ్రాఫ్ట్ పట్టా ప్రతిని ఆమెకు అందజేశారు. పాస్ పుస్తకాల జారీలో ఎలాంటి అవకతవకలు జరగకూడదని, ధ్రువీకరణ ప్రక్రియ అత్యంత జాగ్రత్తగా నిర్వహించాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు.

News January 21, 2026

జగిత్యాల: గ్రామాలే దేశానికి పట్టుకొమ్మలు: మంత్రి సీతక్క

image

జగిత్యాల జిల్లాలో నూకపల్లి న్యాక్ సెంటర్‌లో నూతన సర్పంచుల కోసం ఏర్పాటు చేసిన ఓరియంటేషన్ శిక్షణ కార్యక్రమానికి మంత్రి సీతక్క హాజరయ్యారు. గ్రామాలే దేశానికి పట్టుకొమ్మలని, సుపరిపాలనతో వాటిని ఆదర్శంగా తీర్చిదిద్దాలని సూచించారు. సర్పంచులు ప్రజల అవసరాలను గుర్తించి, కేంద్ర, రాష్ట్ర నిధులను ప్రాధాన్యత క్రమంలో వినియోగించాలని పిలుపునిచ్చారు. పారదర్శకమైన పాలనతో గ్రామాల అభివృద్ధికి కృషి చేయాలన్నారు.

News January 21, 2026

నీటి నిష్క్రమణ ఏ దిశలో ఉండటం వాస్తు సమ్మతం?

image

ఇంటి వాడకం నీరు, వర్షపు నీరు ఈశాన్యం నుంచే వెళ్లాలని అంటారు. కానీ ఇది అన్ని దిశల ఇళ్లకు వర్తించదని వాస్తు నిపుణులు కృష్ణాదిశేషు సూచిస్తున్నారు. ‘పడమర/ దక్షిణం వైపు రోడ్లు ఉన్న ఇళ్లకు ఈశాన్యం లోపలి వైపు ఉంటుంది. అలాంటివారు పడమర వాయువ్యం/దక్షిణ ఆగ్నేయం దిశల నుంచి నీటిని బయటకు పంపాలి. ప్రతి దిక్కుకు ఉండే శుభ ఫలితాలనిచ్చే మూలల ద్వారా నీరు వెళ్లడం వల్ల ఎటువంటి హాని జరగదు’ అంటున్నారు. <<-se>>#Vasthu<<>>