News September 13, 2025

GWL: కేటీఆర్ సభకు గద్వాల ఎమ్మెల్యే హాజరవుతారా?

image

గద్వాల నియోజకవర్గంలో రాజకీయాలు రసవత్తరంగా మారాయి. సుప్రీంకోర్టు ఆదేశాల నేపథ్యంలో స్పీకర్ అనర్హతపై నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. అయితే ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి తాను బీఆర్ఎస్ పార్టీలో ఉన్నట్లు సమాధానం ఇచ్చారు. ఈ నేపథ్యంలో ఈరోజు గద్వాలలో జరిగే కేటీఆర్ బహిరంగ సభకు ఆయన హాజరవుతారా లేదా అనేది జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. దీనిపై ఉత్కంఠ నెలకొంది.

Similar News

News December 7, 2025

రౌడీషీటర్లకు ఎస్పీ హెచ్చరిక

image

తూర్పుగోదావరి ఎస్పీ డి.నరసింహ కిషోర్ ఆదేశాలతో ఆదివారం జిల్లావ్యాప్తంగా రౌడీషీటర్లు, గంజాయి, బ్లేడ్ బ్యాచ్‌లకు పోలీసులు కౌన్సెలింగ్ నిర్వహించారు. ఎస్‌హెచ్‌ఓల సమక్షంలో జరిగిన ఈ కార్యక్రమంలో నేరస్తుల ప్రవర్తనపై ఆరా తీశారు. అందరూ సత్ప్రవర్తనతో మెలగాలని, మళ్లీ చట్టవ్యతిరేక పనులకు పాల్పడితే ఉపేక్షించేది లేదని ఎస్పీ హెచ్చరించారు. అసాంఘిక కార్యకలాపాల్లో భాగస్వాములైన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.

News December 7, 2025

బాపట్ల: షార్ట్‌సర్క్యూట్‌.. రూ.40 లక్షల సామగ్రి దగ్ధం

image

విద్యుత్ షార్ట్‌సర్క్యూట్‌తో రేపల్లెలోని ఓ ఫ్లెక్స్ ప్రింటింగ్ సెంటర్‌లో ఆదివారం అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో సుమారు రూ.40 లక్షల విలువైన ప్రింటింగ్ ప్రెస్ మిషనరీ పూర్తిగా దగ్ధమైనట్లు బాధితుడు తెలిపాడు. విషయం తెలుసుకున్న రేపల్లె నియోజకవర్గ తెలుగు యువత అధ్యక్షుడు రాము ఘటనా స్థలానికి చేరుకొని నష్టపోయిన నిర్వాహకుడిని పరామర్శించారు. ప్రమాదానికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు.

News December 7, 2025

ఇంగ్లండ్ చెత్త రికార్డు

image

యాషెస్ సిరీస్‌లో ఇంగ్లండ్ ఓటముల పరంపర కొనసాగిస్తోంది. రెండో టెస్టులోనూ <<18496629>>పరాజయంపాలైన<<>> ఆ టీమ్ ఓ చెత్త రికార్డును మూటగట్టుకుంది. D/N టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో 300+ స్కోర్ చేసి ఓడిపోయిన మొదటి జట్టుగా నిలిచింది. అలాగే ఒకే విదేశీ గడ్డపై విజయం లేకుండా అత్యధిక మ్యాచులు(16) ఆడిన క్రికెటర్‌గా జో రూట్ ఖాతాలో అన్‌వాంటెడ్ రికార్డు చేరింది. అతను ఆడిన మ్యాచుల్లో 14 ఓడిపోగా, 2 డ్రా అయ్యాయి.