News August 12, 2025
GWL: జిల్లా యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలి: CM

రాష్ట్రంలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున జిల్లా యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. మంగళవారం HYD నుంచి సహచర మంత్రులతో కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. రాబోయే 72 గంటలు అప్రమత్తంగా ఉండాలన్నారు. లోతట్టు ప్రాంతాలపై నిగా పెట్టాలని, జిల్లాలో ఏం జరిగినా కంట్రోల్ రూమ్‌కు సమాచారం ఇవ్వాలని, ముంపు ప్రాంతాల వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించాలన్నారు.
Similar News
News March 9, 2026
BREAKING: భారీగా తగ్గిన బంగారం ధర

హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో ఇవాళ బంగారం ధర భారీగా పడిపోయింది. 24 క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర రూ.1,960 తగ్గి రూ.1,61,680కు చేరింది. అలాగే 22 క్యారెట్ల 10గ్రాముల గోల్డ్ రేటు రూ.1,800 పతనమై రూ.1,48,200 పలుకుతోంది. అటు వెండి ధరల్లో ఎలాంటి మార్పులేదు. కేజీ సిల్వర్ రేటు రూ.2,90,000గా ఉంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో దాదాపు ఇవే ధరలుండొచ్చు.
News March 9, 2026
జగిత్యాల: ఆదర్శలో ప్రవేశాలకు రేపటికే చివరి గడువు

జిల్లాలోని ఆదర్శ పాఠశాలల్లో 6వ తరగతి తోపాటు 7వ, 8వ, 9వ, 10వ తరగతులలో ప్రవేశాల కోసం దరఖాస్తులు చేసుకోవడానికి గడువు రేపటితో ముగియనుంది. 6వ తరగతిలో మొత్తం సీట్ల భర్తీకి మిగిలిన తరగతుల్లో మిగిలిన సీట్ల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నారు. దరఖాస్తుల గడువు గత నెల 28కే ముగియగా ప్రభుత్వం పది రోజుల పాటు గడువు పొడిగించింది. కాగా, ఆ గడువు సైతం రేపటితో ముగియనుంది.
News March 9, 2026
రేపు కదిరి తేరు.. రథం కదిలేది ఎప్పుడంటే?

కదిరి ఖాద్రీ లక్ష్మీనరసింహ స్వామి బ్రహ్మరథోత్సవానికి ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. రేపు ఉదయం 8:25 నుంచి 8:45 గంటల మధ్య శుభ మేష లగ్నంలో <<19334160>>రథం<<>> కదలనుందని వేదపండితులు తెలిపారు. భక్తజన సందోహం మధ్య గోవింద నామస్మరణతో కదిరి పురవీధులు మారుమోగనున్నాయి. ఈ చారిత్రక వేడుకను వీక్షించేందుకు తెలుగు రాష్ట్రాలతో పాటు వివిధ ప్రాంతాల నుంచి లక్షలాది మంది భక్తులు భారీగా తరలివస్తున్నారు.


