News March 12, 2025

GWL: ప్రేమ వ్యవహారం.. అబ్బాయి తల్లిపై దాడి

image

ప్రేమ వ్యవహారంలో అబ్బాయి తల్లిని చెట్టుకు కట్టేసి దాడి చేసిన ఘటన ఇటిక్యాల మం. వేముల గ్రామంలో వెలుగుచూసింది. పోలీసుల వివరాలు.. తన కుమార్తెను గ్రామానికి చెందిన యువకుడు ప్రేమించి తీసుకెళ్లాడని ఆ యువకుడి తల్లి మారెమ్మపై యువతి తరఫున వారు దాడిచేశారు. స్థానికులు పోలీసులకు తెలపగా వారు చేరుకుని ఆమెను విడిపించారు. ఈ మేరకు దాడి చేసిన వారిపై కేసు నమోదు చేసినట్లు సమాచారం. పూర్తివివరాలు తెలియాల్సి ఉంది.

Similar News

News January 22, 2026

VJA: YS జగన్‌పై బుద్ధా వెంకన్న హాట్ కామెంట్స్!

image

YS జగన్ రాజకీయాల నుంచి తప్పుకోవాల్సిన సమయం ఆసన్నమైందని మాజీ MLC బుద్ధా వెంకన్న అన్నారు. విజయవాడలో ఆయన మాట్లాడుతూ.. జగన్ ఎన్ని పాదయాత్రలు చేసినా, మరెన్ని వేషాలు వేసినా ప్రజలు ఆయన్ను నమ్మే స్థితిలో లేరన్నారు. చంద్రబాబు అమలు చేస్తున్న సంక్షేమ పథకాల పట్ల ప్రజల్లో ఆదరణ రోజురోజుకూ పెరుగుతోందన్నారు. లోకేశ్‌ను ‘నవయుగ అభిమన్యుడు’గా అభివర్ణిస్తూ, ఆయన పనితీరు పార్టీకి ఎంతో బలాన్ని ఇస్తోందని కొనియాడారు.

News January 22, 2026

ముగిసిన విజయసాయి రెడ్డి ఈడీ విచారణ

image

AP: మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి ఈడీ విచారణ ముగిసింది. లిక్కర్ స్కామ్ కేసులో హైదరాబాద్‌ కార్యాలయంలో ఆయనను సుమారు 7 గంటల పాటు విచారించింది. పాలసీ విధాన నిర్ణయాలు, రహస్య ఆర్థిక లావాదేవీలపై ఆరా తీసిన ఈడీ అధికారులు విజయసాయి స్టేట్‌మెంట్‌ను రికార్డ్ చేశారు. ఆర్థిక లావాదేవీలపై అధికారులకు ఆయన కొన్ని డాక్యుమెంట్స్ సబ్మిట్ చేశారు.

News January 22, 2026

కోనసీమ: బైపాస్ రోడ్డుపై ప్రమాదం.. వ్యక్తి మృతి

image

రాజోలు(M) పాలగుమ్మి బైపాస్ రోడ్డుపై బుధవారం రాత్రి జరిగిన <<18919438>>రోడ్డు ప్రమాదం<<>>లో పాలకొల్లుకు చెందిన షేక్ మస్తాన్(45) మృతి చెందినట్లు ఎస్సై రాజేష్ గురువారం తెలిపారు. మస్తాన్ సైకిల్‌పై నగరం వైపు వెళ్తుండగా గుర్తుతెలియని మోటార్ సైకిల్ ఢీకొట్టింది. తలకు తీవ్ర గాయాలు కావడంతో తొలుత రాజోలు, ఆపై మెరుగైన వైద్యం కోసం కాకినాడ తరలించగా చికిత్స పొందుతూ మరణించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.