News August 20, 2025
GWL: బాలుర వసతి గృహాన్ని తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్

ఎర్రవల్లి మండలం ధర్మవరంలోని వెనుకబడిన తరగతుల బాలుర వసతి గృహాన్ని జిల్లా కలెక్టర్ సంతోష్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆయన వంట గదులు, స్టోర్ రూమ్‌లను పరిశీలించారు. విద్యార్థులకు నాణ్యమైన పౌష్టికాహారం, విద్యను అందించాలని అధికారులను ఆదేశించారు. శిథిలావస్థకు చేరుకున్న తరగతి గదులకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని సూచించారు. ఈ తనిఖీలో సిబ్బంది పాల్గొన్నారు.
Similar News
News January 14, 2026
బాపట్లలో రాష్ట్రస్థాయి ఎడ్ల ప్రదర్శన

సంక్రాంతి సందర్భంగా బాపట్లలో 16వ రాష్ట్రస్థాయి ఎడ్ల ప్రదర్శన బుధవారం ప్రారంభమైంది. బీమావారిపాలెం రామాలయం కమిటీ ఆధ్వర్యంలో మున్నంవారిపాలెం రోడ్డులో ఈ ప్రదర్శన ఏర్పాటు చేశారు. మాజీ ఎమ్మెల్సీ అన్నం సతీష్ ప్రభాకర్, డీఎస్పీ రామాంజనేయులు పోటీలను ప్రారంభించారు. పండగ పూట నిర్వహించిన ఈ ప్రదర్శనను తిలకించేందుకు జనం ఆసక్తి చూపారు.
News January 14, 2026
ఫేక్ రిఫండ్లతో ₹5 కోట్లు కొల్లగొట్టాడు

e-కామర్స్ ప్లాట్‌ఫాంల రిటర్న్ సిస్టమ్ లూప్‌హోల్స్‌ను ఆసరా చేసుకొని ఓ యువకుడు రిఫండ్ కింద ఏకంగా ₹5Cr కొల్లగొట్టాడు. చైనాలో లూ అనే వ్యక్తి కాస్మొటిక్ షాపింగ్ ప్లాట్‌ఫాంలో 11900 ఫేక్ రిఫండ్ రిక్వెస్టులు పెట్టాడు. తనకు వచ్చిన వస్తువుల్ని తిరిగి సెకండ్స్ కింద మార్కెట్లో అమ్మేవాడు. 2024లో రిఫండ్‌లపై అనుమానంతో ఓ కంపెనీ ఫిర్యాదు చేయగా స్కామ్ బయటపడింది. చివరకు కోర్టు అతనికి 6ఏళ్ల జైలుశిక్ష విధించింది.
News January 14, 2026
జగిత్యాల: కేంద్రానికి స్పీడ్ పోస్టుల వినతులు

పెన్షనర్లకు ఆదాయపు పన్ను రద్దు చేయాలని రాష్ట్ర కార్యదర్శి, జగిత్యాల జిల్లా అధ్యక్షులు హరి అశోక్ కుమార్ కోరారు. ఈ సందర్భంగా జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన సమావేశం ఆయన మాట్లాడుతూ.. 2026-27 కేంద్ర బడ్జెట్ నేపథ్యంలో తమ గోడును వినిపించేందుకు ‘స్పీడ్ పోస్టు’ ఉద్యమం చేపట్టినట్లు తెలిపారు. ఈ మేరకు ప్రధానమంత్రి, కేంద్ర ఆర్థిక మంత్రికి వినతిపత్రాలు పంపినట్లు పేర్కొన్నారు.


