News November 20, 2025
GWL: బాల్య దశ మరపురానిది -అడిషనల్ కలెక్టర్ నర్సింగరావు

బాల్య దశ ప్రతి ఒక్కరికి మరపురానిదని ఆ దశ అందరి జీవితంలో ఎప్పటికీ గుర్తుంటుందని గద్వాల అడిషనల్ కలెక్టర్ నర్సింగరావు పేర్కొన్నారు. బాలల దినోత్సవాన్ని పురస్కరించుకొని గురువారం ఐడిఓసిలో బాలల పరిరక్షణ విభాగం ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ముగింపు వేడుకలను ప్రారంభించారు. చదువుకోవడం బాలల హక్కు అని బడి మానేసిన వారిని బడిలో చేర్చాలని, పిల్లలు వేధింపులకు గురికాకుండా చూడాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు.
Similar News
News January 18, 2026
KNR: మేడారం జాతరకు ప్రత్యేక బస్సుల, ఛార్జీల వివరాలు

మేడారం జాతర సందర్భంగా ప్రత్యేక బస్సుల వివరాలు ఇలా ఉన్నాయి. KNR నుంచి 140 బస్సులు, పెద్దలకు రూ.390, పిల్లలకు రూ.220, HSB నుంచి 50 బస్సులు, పెద్దలకు రూ.350, పిల్లలకు రూ.200, HZBనుంచి 50 బస్సులు, పెద్దలకు రూ.320, పిల్లలకు రూ.180, PDPL నుంచి 175 బస్సులు, పెద్దలకు రూ.420, పిల్లలకు రూ.240, GDK నుంచి 115 బస్సులు, పెద్దలకు రూ.400, పిల్లలకు రూ.230, MNTY 170 బస్సులు, పెద్దలకు రూ.350, పిల్లలకు 210గా ఉన్నాయి.
News January 18, 2026
తిరుపతి: మహిళలకు ఫ్రీ ట్రైనింగ్

తిరుచానూరు సమీపంలోని NTR మహిళా ప్రాంగణం నందు ఔత్సాహిక మహిళలకు వివిధ రంగాల్లో ఉచిత నైపుణ్య శిక్షణ కల్పిస్తున్నట్లు జిల్లా మేనేజర్ ఫర్జానా పేర్కొన్నారు. సారీ రోలింగ్ – 10 రోజులు, మిల్లెట్స్ స్నాక్స్ తయారీ, (ప్యాకింగ్, ఇంటర్నేషనల్ మార్కెటింగ్) – 15 రోజులు కిచెన్, టెర్రస్ గార్డెనింగ్, ఫ్యాబ్రిక్ పెయింటింగ్, కంప్యూటర్ లిటరసీ ప్రోగ్రాం – 30 రోజులు. 18- 45 ఏళ్లలోపు 8వ తరగతి పాసైన మహిళలు అర్హులన్నారు.
News January 18, 2026
KNR రీజియన్‌లో 700 బస్సులు ఏర్పాట్లు

మేడారం జాతర సందర్భంగా ప్రత్యేక<<18889925>> బస్సులు<<>> ఏర్పాట్లు చేసినట్లు ఆర్టీసీ KNR RM బి.రాజు తెలిపారు. JAN 27 నుంచి JAN 31వ తేదీ వరకు KNR రీజియన్ పరిధిలో <<18874838>>700<<>> బస్సులు ఏర్పాటు చేశామన్నారు. ఈ ప్రత్యేక బస్సులు 24 గంటలు అందుబాటులో ఉంటాయని తెలిపారు. ఈ ప్రత్యేక బస్సులలో మహాలక్ష్మి పథకం వర్తిస్తుందని అన్నారు. ఆర్టీసీ బస్సులు గద్దె వరకు వెళ్లే సౌలభ్యం ఉన్నందున ఆర్టీసీ బస్సులలో ప్రయాణం చేయాలని కోరారు.


