News August 13, 2025
GWL: ‘మహిళలను స్వయం సహాయక సంఘాల్లో చేర్చాలి’

మహిళలను ఆర్థికాభివృద్ధికి స్వయం సహాయక సంఘాల్లో చేర్చాలని గద్వాల అడిషనల్ కలెక్టర్ నర్సింగరావు సూచించారు. బుధవారం ఐడీఓసీ మందిరంలో గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ ఆధ్వర్యంలో నూతన స్వయం సహాయక సంఘాల ఏర్పాటు శిక్షణలో పాల్గొన్నారు. ప్రభుత్వం మహిళల కోసం అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తుందని, స్వయం సహాయక సంఘాల్లో ఉంటే వారికి లబ్ధి చేకూరుతుందన్నారు. మహిళలు ఆర్థికంగా ఎదిగితే కుటుంబం అభివృద్ధి చెందుతుందన్నారు.
Similar News
News March 9, 2026
పి.గన్నవరం: గోదావరిలో దూకి మహిళ ఆత్మహత్యాయత్నం

యానాం–ఎదురులంక వంతెనపై సోమవారం ఉదయం ఓ మహిళ గోదావరిలోకి దూకి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. అయితే, అదే సమయంలో నదిలో చేపల వేట సాగిస్తున్న జాలర్లు ఆమె కేకలు విని అప్రమత్తమయ్యారు. నీటి ప్రవాహంలో కొట్టుకుపోతున్న ఆమెను చాకచక్యంగా కాపాడి ఒడ్డుకు చేర్చారు. సమయస్ఫూర్తితో స్పందించి ఒక ప్రాణాన్ని నిలిపిన జాలర్లను స్థానికులు అభినందించారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
News March 9, 2026
HYD: 20 కిలోల టమాట రూ.60.. రైతుల ఆవేదన!

HYDలో టమాట ధరలు రోజు రోజుకు పడిపోతున్నాయి. బోయిన్‌పల్లి మార్కెట్‌లో గత 3, 4 రోజులుగా టమాట ధరలు భారీగా తగ్గాయి. ప్రస్తుతం 20 కిలోల టమాట క్రేట్ ధర కేవలం రూ.60 నుంచి రూ.150 మధ్య మాత్రమే పలుకుతోంది. సరఫరా ఎక్కువగా రావడం, వివాహాది శుభకార్యాలు ఇంకా మొదలవ్వకపోవడంతో వినియోగం తగ్గి ధరలు పడిపోతున్నాయని వ్యాపారులు చెబుతున్నారు. దీంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
News March 9, 2026
రంగారెడ్డి జిల్లాలో రైతు రిజిస్ట్రేషన్ 88% పూర్తి

రంగారెడ్డి జిల్లా పరిధిలో రైతుల రిజిస్ట్రేషన్ ప్రక్రియపై అధికారులు ఫోకస్ చేశారు. జిల్లాలో మొత్తం 1,97,029 మంది రైతులు ఉండగా ఇప్పటివరకు 88% రిజిస్ట్రేషన్ మాత్రమే పూర్తైనట్లుగా అధికారులు తెలిపారు. పీఎం కిసాన్ లాంటి పథకాలు అందాలంటే రైతుల రిజిస్ట్రేషన్ తప్పనిసరి. ఈ నేపథ్యంలో రంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా ఉన్న రైతులందరూ రిజిస్ట్రేషన్ చేసుకోవాలని అధికారులు సూచించారు.


