News August 21, 2025

GWL: రేపటి నుంచి పనుల జాతర ప్రారంభం

image

పంచాయతీరాజ్, గ్రామీణశాఖ ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న పనుల జాతర-2025 కార్యక్రమాన్ని రేపటి నుంచి ప్రారంభిచనున్నట్లు ఎంపీడీవో రాఘవ తెలిపారు. ఇందిరా మహిళా శక్తి, ఉపాధి భరోసా, పొలం బాటలు, జలనిధి, గ్రామీణ మౌలిక వసతుల కోసం కావలసిన పనులను కూడా చేపడుతున్నామన్నారు. రాబోయే సంవత్సరం మార్చి వరకు ఈ పనులను పూర్తి చేయాలన్నారు. రేపటి నుంచి ప్రత్యేక అధికారులు గ్రామాల్లో ఉండాలన్నారు.

Similar News

News January 21, 2026

MNCL: ‘శాంతియుతంగా ఎన్నికలు జరిగేలా చర్యలు’

image

2వ సాధారణ మున్సిపల్ ఎన్నికలు- 2026 శాంతియుతంగా, స్వేచ్ఛగా నిష్పక్షపాతంగా జరిగేలా 163BNSS ప్రకారం చర్యలు తీసుకుంటున్నట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ కుమార్ దీపక్ తెలిపారు. ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైన తర్వాత ఎన్నికల ప్రక్రియలో భాగంగా నామినేషన్, పోలింగ్, లెక్కింపు వంటి కీలక కార్యమాల సమయంలో చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.

News January 21, 2026

ఖానాపూర్‌లో రూ.13కోట్లతో సబ్‌స్టేషన్ల నిర్మాణం

image

ఖానాపూర్ నియోజకవర్గంలో విద్యుత్ సమస్యల పరిష్కారానికి రూ.13 కోట్ల వ్యయంతో ఏర్పాటు చేయనున్న 33/11 కేవీ విద్యుత్ సబ్‌స్టేషన్లకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క భూమి పూజ చేశారు. వీటి ద్వారా రైతులకు, గృహాలకు నాణ్యమైన, నిరంతర విద్యుత్ సరఫరా అందుతుందని తెలిపారు. వ్యవసాయ రంగంలో రూ.12,500 కోట్లతో ‘ఇందిరా సౌర గిరి వికాసం’ పథకం అమలు చేస్తున్నామని తెలిపారు.

News January 21, 2026

FEB 15 తర్వాత మిట్టల్ స్టీల్ ప్లాంట్‌కు శంకుస్థాపన

image

AP: CM CBNతో ఆర్సెల్లార్ మిట్టల్ ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్ లక్ష్మీ మిట్టల్ భేటీ అయ్యారు. అనకాపల్లి ప్రాంతంలో ఏర్పాటు చేయతలపెట్టిన స్టీల్ ప్లాంట్ అంశాలపై చర్చించారు. FEB 15 తరువాత ప్లాంటుకు శంకుస్థాపన చేయాలని నిర్ణయించారు. ఆలోపు భూసేకరణ, అనుమతులు పూర్తి చేయాలని CM అధికారులను ఆదేశించారు. అవసరమైతే ఢిల్లీ వెళ్లి కేంద్రం నుంచి త్వరితగతిన అనుమతులు సాధించాలని మంత్రులు లోకేశ్, టీజీ భరత్‌లకు సూచించారు.