News November 12, 2025

GWL: ‘యు-డైస్ వివరాలు కచ్చితంగా నమోదు చేయాలి’

image

గద్వాల జిల్లాలోని పాఠశాలలకు సంబంధించిన యు-డైస్ (U-DISE) వివరాలు కచ్చితంగా నమోదు చేయాలని కలెక్టర్ సంతోష్ అధికారులను ఆదేశించారు. బుధవారం ఐడీవోసీ కాన్ఫరెన్స్ హాల్‌లో విద్యాశాఖ పనితీరుపై సమీక్ష నిర్వహించారు. మండలాల వారీగా పాఠశాలలు, విద్యార్థులు, ఉపాధ్యాయులు, మౌలిక వసతుల వివరాలను యు-డైస్‌లో పొందుపరచాలన్నారు. వాస్తవ పరిస్థితులను మాత్రమే నమోదు చేయాలని ఆయన సూచించారు.

Similar News

News November 12, 2025

ట్రిలియన్ డాలర్ల పెట్టుబడులే లక్ష్యం: మంత్రి లోకేశ్

image

AP: ట్రిలియన్ డాలర్ల పెట్టుబడులను ఆకర్షించడమే తమ లక్ష్యమని మంత్రి లోకేశ్ తెలిపారు. ‘గత 16 నెలల్లో $120B పెట్టుబడులు వచ్చాయి. 5 ఏళ్లలో 20L ఉద్యోగాలు కల్పిస్తామని హామీ ఇచ్చాం. పెట్టుబడిదారులు APని ఎందుకు ఎంచుకోవాలో 3 కారణాలు చెబుతాను. ఒకటి స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్. రెండోది సమర్థవంతమైన నాయకత్వం. మూడోది డబుల్ ఇంజిన్ బుల్లెట్ ట్రైన్ సర్కార్’ అని CII సమ్మిట్‌పై నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో వివరించారు.

News November 12, 2025

యాదాద్రి: రేపు ప్రత్యేక గ్రీవెన్స్, ఉద్యోగవాణి రద్దు

image

ప్రతి గురువారం నిర్వహించే ప్రత్యేక గ్రీవెన్స్, ఉద్యోగవాణి కార్యక్రమాన్ని రద్దు చేసినట్లు యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంతరావు ఒక ప్రకటనలో తెలిపారు. ప్రజలు, ఉద్యోగులు తమ సమస్యలపై దరఖాస్తులు ఇచ్చేందుకు కార్యాలయానికి రావద్దని కలెక్టర్ ఈ సందర్భంగా సూచించారు.

News November 12, 2025

అప్పుడు TTD EO నేను కాదు: ధర్మారెడ్డి

image

కల్తీ నెయ్యి సరఫరా చేస్తున్నట్లు గతంలోనే CFTRI మైసూరు ల్యాబ్ నివేదిక ఇస్తే ఎందుకు కొనసాగించారని ధర్మారెడ్డిని సీబీఐ సిట్ అధికారులు ప్రశ్నించినట్లు సమాచారం. ‘దీనిపై నాకు సమాచారం లేదు. ఆ సమయంలో ఈవోగా నేను లేను. నాకంటే ముందు పనిచేసిన వారిని అడగండి’ అని ధర్మారెడ్డి చెప్పినట్లు తెలుస్తోంది. అవసరమైతే మరోసారి విచారణకు రావాలని ధర్మారెడ్డిని అధికారులు ఆదేశించారు.