News March 27, 2024
18 బంతుల్లోనే హాఫ్ సెంచరీ

సన్‌రైజర్స్ హైదరాబాద్ ఓపెనర్ ట్రావిస్ హెడ్ విజృంభిస్తున్నారు. ముంబైతో మ్యాచ్‌లో సిక్సులు, ఫోర్లతో విరుచుకుపడుతున్నారు. బౌలర్ ఎవరన్నది లెక్కచేయకుండా కేవలం 18 బంతుల్లోనే 52* రన్స్ చేశారు. అందులో 2 సిక్సులు, 9 ఫోర్లు ఉన్నాయి. SRH చరిత్రలో ఇదే ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ కావడం విశేషం.
Similar News
News February 16, 2026
మిల్క్ బ్యాంక్ గురించి తెలుసా?

మిల్క్ బ్యాంక్ తల్లి పాల దాతల నుండి పాలను సేకరిస్తుంది. ప్రసవానంతర మహిళలు వారి బిడ్డలకు పాలు ఇవ్వగా, మిగిలిన పాలను మిల్క్ బ్యాంక్‌లో డొనేట్ చేస్తారు. ఫార్ములా పాలతో పోల్చి చూస్తే పాశ్చరైజ్డ్ డోనర్ పాల కు పోషక విలువలు ఎక్కువ. ముందుగా పాలల్లో సూక్ష్మ క్రిములు ఉన్నాయేమో చెక్ చేసి తర్వాత పాలను పాశ్చరైజ్ చేసి, నిల్వ చేస్తారు. తల్లిపాలు లభ్యంకాని శిశువులకు డోనర్ పాలను మిల్క్ బ్యాంక్ పంపిణీ చేస్తుంది.
News February 16, 2026
తల్లిపాలు దానం చేయడానికి ఎవరు అర్హులంటే..

తల్లిపాలు దానం చేయాలంటే ముందుగా ఆ మహిళకు ఏ రకమైన ఇన్ఫెక్షన్లూ లేవని రక్త పరీక్షల ద్వారా నిర్ధారించాలి. తన బిడ్డకు సంతృప్తికరంగా పాలు తాగించిన తర్వాత, డొనేట్ చేయగలిగినన్ని పాలు కలిగి ఉంటే వాటిని దానం చేయవచ్చు. పొగాకు, డ్రగ్స్, ఆల్కహాల్, ఎక్కువ కెఫీన్ తీసుకొనే అలవాటు ఉన్నవారు తల్లి పాలను దానం చేయడానికి అనర్హులు. HIV, HTLV, హెపటైటిస్ B/ C/ సిఫిలిస్ ఇన్ఫెక్షన్ ఉన్నా బ్రెస్ట్ మిల్క్ డొనేట్ చేయకూడదు.
News February 16, 2026
గర్భం దాల్చకుండానే చనుబాలు వస్తున్నాయా?

గర్భం దాల్చకపోయినా మహిళల్లో పాలు ఉత్పత్తి కావడాన్ని గెలాక్టోరియా అంటారు. ఈ సమస్య కేవలం మహిళల్లో మాత్రమే కాదు.. పురుషుల్లో కూడా వస్తుంది. ఇది ఎక్కువగా పిట్యూటరీ గ్రంథి, హార్మోన్ల అసమతుల్యత, గర్భనిరోధక మాత్రలు, యాంటీ డిప్రెసెంట్స్, బీపీ, లోదుస్తులు, థైరాయిడ్, అమెనోరియా, హైపోథైరాయిడిజం, కిడ్నీ సమస్యలు, జనన నియంత్రణ మందులు వాడటం, మెంతి, సోంపు వంటి మూలిక మందులు వాడటం వల్ల చనుబాలు ఉత్పత్తి అవుతాయి.


