News March 28, 2024

పుట్టినరోజు శుభాకాంక్షలు

image

ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.

Similar News

News February 11, 2026

రాజమండ్రి: వికసిత భారత్ కమిటీ ఛైర్‌పర్సన్‌గా పురందేశ్వరి

image

‘వికసిత భారత్ శిక్షా అధిష్ఠాన్ బిల్లు- 2025’ సంయుక్త కమిటీ ఛైర్‌పర్సన్‌గా రాజమండ్రి ఎంపీ దగ్గుపాటి పురందేశ్వరి నియమితులయ్యారు. ఈ సందర్భంగా ఆమె ప్రధాని మోదీ, స్పీకర్ ఓం బిర్లాకు కృతజ్ఞతలు తెలిపారు. 2047 నాటికి విద్యా వ్యవస్థను బలోపేతం చేస్తూ, వికసిత భారత్ లక్ష్య సాధన కోసం కమిటీ సభ్యులతో కలిసి అంకితభావంతో కృషి చేస్తానని ఆమె పేర్కొన్నారు.

News February 11, 2026

బీట్ రూట్ సాగులో కలుపు నివారణ ఎలా?

image

బీట్ రూట్‌లో కలుపు మొక్కలను ఎప్పటికప్పుడు తొలగించాలి. విత్తిన 24-48 గంటల్లోపు ఎకరాకు తేలిక నేలల్లో 200 లీటర్ల నీటిలో పెండిమిథాలిన్ 1.25 లీటర్లు, అదే బరువు నేలల్లో అయితే 200 లీటర్ల నీటిలో అలాక్లోర్ 1.25L కలిపి పిచికారీ చేయాలి. విత్తిన 15 రోజులకు 200 లీటర్ల నీటిలో మెట్రిబుజిన్ 300 గ్రా. కలిపి పిచికారీ చేయాలి. గింజ మొలకెత్తిన 20-25 రోజుల తర్వాత కలుపు తీసి మన్ను ఎగదోస్తే గడ్డ బాగా ఊరుతుంది.

News February 11, 2026

DRDOలో 25 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల

image

<>DRDO<<>>కు చెందిన డిఫెన్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హై ఆల్టిట్యూడ్ రీసెర్చ్(DIHAR) 25 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హత గలవారు ఫిబ్రవరి 24న ఇంటర్వ్యూకు హాజరుకావచ్చు. పోస్టును బట్టి BE/BTech, GATE, ME/MTech అర్హతతో పాటు పని అనుభవం గలవారు అర్హులు. వయసు 28 నుంచి 35ఏళ్ల మధ్య ఉండాలి. JRFకు నెలకు రూ.37,000, RAకు రూ.67,000 చెల్లిస్తారు. వెబ్‌సైట్: https://www.drdo.gov.in