News April 11, 2024
పుట్టినరోజు శుభాకాంక్షలు

ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.
Similar News
News December 5, 2025
స్మృతి మంధాన ఎంగేజ్‌మెంట్ రింగ్ ఎక్కడ?

తన వివాహం వాయిదా పడిన తర్వాత క్రికెటర్ స్మృతి మంధాన చేసిన తొలి ఇన్‌స్టా పోస్ట్ చర్చనీయాంశమైంది. ఓ యాడ్ షూట్ వీడియోను ఆమె షేర్ చేయగా.. అందులో స్మృతి చేతికి ఎంగేజ్‌మెంట్ రింగ్ కనిపించకపోవడాన్ని ఫ్యాన్స్ గుర్తించారు. దీంతో ఉంగరం ఎక్కడుందని, పెళ్లి రద్దయిందా? అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇప్పటికీ కొత్త వివాహ తేదీపై ప్రకటన చేయకపోవడం, రింగ్ తీసేయడం ఈ అనుమానాలకు బలాన్నిస్తున్నాయని చెబుతున్నారు.
News December 5, 2025
IndiGo సంక్షోభం.. బాధ్యత ఎవరిది?

కొత్త FDTL (Flight Duty Time Limitations) నిబంధనల అమలుతో <<18479258>>IndiGo<<>> తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. పైలట్లకు వారానికి 48 గంటల రెస్ట్‌తో పాటు ఇతర పరిమితులతో సిబ్బంది కొరత తలెత్తింది. DGCA 18 నెలల గడువు ఇచ్చినా సంస్థ సిబ్బందిని నియమించుకోలేదని పైలట్ సంఘాలు ఆరోపిస్తున్నాయి. ప్రజల భద్రత కోసమే ప్రభుత్వం నియమాలు తీసుకువచ్చిందని.. విమానాల రద్దు, ఆలస్యానికి ప్రణాళిక లోపమే కారణమని నిపుణులు అభిప్రాయపడ్డారు.
News December 5, 2025
డెలివరీ టైంలో ట్యూబెక్టమీ చేయించుకోవచ్చా?

చాలామంది మహిళలు డెలివరీ సమయంలో విశ్రాంతి, ఆస్పత్రి ఖర్చులు కలిసి వస్తాయని ట్యూబెక్టమీ చేయించుకోవాలనుకుంటారు. కానీ సిజేరియన్‌తోపాటు ట్యూబెక్టమీ ఆపరేషన్ చేసినపుడు అది ఫెయిల్ అయ్యే అవకాశాలుంటాయని నిపుణులు చెబుతున్నారు. అలాగే కాన్పు తర్వాత సంవత్సరం ఆగి, టీకాలన్నీ పూర్తయి, బిడ్డకు ఎలాంటి లోపాలూ లేవని, ఆరోగ్యం అంతా బాగుందని నిర్ధారించుకుని, అప్పుడు ట్యూబెక్టమీ చేయించుకుంటే మంచిది.


