News April 14, 2024

పుట్టినరోజు శుభాకాంక్షలు

image

ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.

Similar News

News December 17, 2025

రూ.లక్ష రుణం పొందడానికి అర్హతలు ఏమిటి?

image

AP: కౌలు రైతులు రూ.లక్ష వరకు రుణం పొందాలంటే తప్పనిసరిగా సంబంధిత అధికారులు జారీ చేసిన కౌలు పత్రాలు కలిగి ఉండాలి. ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాల పరిధిలో నివాసం ఉంటూ, వాటిలో సభ్యులై ఉండాలి. సొంత ఇల్లు ఉన్నవారికి ఈ రుణంలో ప్రాధాన్యత ఇస్తారు. కౌలు పత్రంలో సాగు చేసే భూమి ఎకరా కంటే తక్కువ ఉండకూడదు. రుణం పొందిన రోజు నుంచి ఏడాది లోపు అసలు, వడ్డీతో కలిపి రుణం మొత్తాన్ని తిరిగి చెల్లించాలి.

News December 17, 2025

ఫ్లాట్‌గా మొదలై లాభాల వైపు..

image

దేశీయ స్టాక్ మార్కెట్లు ఇవాళ ఫ్లాట్‌గా మొదలై లాభాల వైపు పయనిస్తున్నాయి. ప్రస్తుతం బీఎస్ఈ సెన్సెక్స్ 162 పాయింట్లు లాభపడి 84,843 వద్ద, నిఫ్టీ 53 పాయింట్లు వృద్ధి చెంది 25,913 వద్ద కొనసాగుతోంది. యాక్సిక్ బ్యాంక్, ఎస్బీఐ, ఎటర్నల్, బజాజ్ ఫైనాన్స్, టీసీఎస్, మారుతి, టాటా స్టీల్, ఎయిర్‌టెల్, రిలయన్స్ షేర్లు లాభాల్లో ఉన్నాయి.

News December 17, 2025

విమర్శలను ఎదుర్కోవడం నేర్చుకోండి

image

తమపై విమర్శలు వస్తే అమ్మాయిలు కుంగిపోతూ ఉంటారు. అయితే వాటిని సానుకూలంగా చూడటం అలవాటు చేసుకోవాలంటున్నారు సైకాలజిస్టులు. అప్పుడే విమర్శల నుంచి పాఠాలు నేర్చుకొని మరింత ఎదిగే అవకాశం లభిస్తుందంటున్నారు. ‘విమర్శలను మనసుకు తీసుకుంటే భావోద్వేగాలు తీవ్రమై, మానసిక క్షోభ అనుభవించాల్సి ఉంటుంది. విమర్శలకు, భావోద్వేగాలకు ముడిపెట్టకూడదు. సానుకూల విమర్శలను స్వీకరించి వృద్ధికి బాటగా మలచుకోవాలి’ అని చెబుతున్నారు.