News April 20, 2024

CBNకు జనసేనాని పుట్టినరోజు శుభాకాంక్షలు

image

TDP అధినేత చంద్రబాబుకు జనసేనాని పవన్ కళ్యాణ్ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ‘రాజకీయంగా, పరిపాలనాపరంగా అనుభవజ్ఞులైన చంద్రబాబు నిరంతరం రాష్ట్రం గురించే ఆలోచిస్తారు. రాజకీయ ఒత్తిళ్లు, వేధింపులు ఎన్ని ఎదురైనా దృఢ చిత్తంతో ఎదుర్కొంటారు. వైసీపీ సర్కారు బనాయించిన కేసులతో కారాగారంలో ఉన్నప్పుడూ మనో నిబ్బరం కోల్పోలేదు. ఆయనకు సంపూర్ణ ఆయురారోగ్యాలు ప్రసాదించాలని భగవంతుణ్ని కోరుకుంటున్నా’ అని తెలిపారు.

Similar News

News December 14, 2025

హిందూ ధర్మంలో ‘108’ విశిష్టత

image

మనం 108ని పవిత్రమైన సంఖ్యగా భావించడానికి అనేక కారణాలున్నాయి. మన హిందూ ధర్మంలో ఈ సంఖ్యకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. దేవతలకు నామాలు, శివుడికి అనుచరులు, కృష్ణుడి బృందావనంలో పూల సంఖ్య నూట ఎనిమిదే. ఖగోళ శాస్త్రం ప్రకారం.. సూర్యచంద్రుల వ్యాసానికి 108 రెట్లు వాటికి భూమికి మధ్య దూరం ఉంటుంది. మనవ శరీరంలో కూడా మనం దృష్టి సారించాల్సిన చక్రాలు 108 ఉంటాయి. జపమాలలోనూ ఇన్నే పూసలుంటాయి.

News December 14, 2025

CSIR-CECRIలో ఉద్యోగాలు

image

చెన్నైలోని CSIR-సెంట్రల్ ఎలక్ట్రోకెమికల్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్(CECRI)12 పోస్టులను భర్తీ చేయనుంది. Sr.ప్రాజెక్ట్ అసోసియేట్, Sr.రీసెర్చ్ ఫెల్లో, ప్రాజెక్ట్ అసోసియేట్ పోస్టులు ఉన్నాయి. అర్హతగల అభ్యర్థులు DEC 24న ఇంటర్వ్యూకు హాజరు కావొచ్చు. పోస్టును బట్టి డిప్లొమా, BSc, BE, బీటెక్, ME, ఎంటెక్ , MSc(కెమిస్ట్రీ), PhD ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. వెబ్‌సైట్: https://www.cecri.res.in/

News December 14, 2025

ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేసే ఉద్దేశం లేదు: నాగబాబు

image

AP: ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేసే ఉద్దేశం తనకు లేదని నటుడు, MLC నాగబాబు స్పష్టం చేశారు. శ్రీకాకుళం(D) లావేరులో జరిగిన జనసేన మీటింగ్‌లో ఈ విషయాన్ని వెల్లడించారు. ‘MLAగా పోటీ చేయాలనుకుంటే వచ్చే ఎన్నికల వరకు ఎందుకు? గత ఎన్నికల్లోనే పోటీ చేసేవాడిని. 5-6 ఏళ్ల తర్వాత సంగతి చెప్పమంటే ఏం చెబుతాం. జనసేన ప్రధాన కార్యదర్శిగా కంటే జనసేన కార్యకర్త అనిపించుకోవడంలోనే సంతృప్తి ఉంటుంది’ అని తెలిపారు.