News February 17, 2025

HAPPY BIRTHDAY KCR: CM రేవంత్ రెడ్డి

image

గజ్వేల్ నియోజకవర్గ శాసనసభ్యులు, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు జన్మదినం సందర్భంగా ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి హార్దిక శుభాకాంక్షలు తెలియజేశారు. నిత్యం ప్రజాసేవలో నిమగ్నమవుతూ రాష్ట్రాభివృద్ధికి పాటుపడటంలో భగవంతుడు వారికి సంపూర్ణ ఆయురారోగ్యాలు ప్రసాదించాలని ఆకాంక్షించారు. కాసేపటి క్రితం ఇందుకు సంబంధించిన ఫొటోను తెలంగాణ CMO ట్వీట్ చేసింది.

Similar News

News March 15, 2026

టెన్త్ పరీక్షా కేంద్రాల వద్ద బందోబస్తు: SP

image

పదో తరగతి పబ్లిక్ పరీక్షలు ప్రశాంతంగా నిర్వహించేందుకు జిల్లా వ్యాప్తంగా 165 పరీక్షా కేంద్రాల వద్ద కట్టుదిట్టమైన పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు SP సుబ్బారాయుడు తెలిపారు. కేంద్రాల వద్ద సెక్షన్ 144 అమలు చేస్తూ మాస్ కాపీయింగ్‌పై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. విద్యార్థులు ప్రశాంతంగా పరీక్షలు రాయాలని ఆకాంక్షించారు.

News March 15, 2026

తిరుమలలో అన్నమయ్య 523వ వర్ధంతి మహోత్సవం

image

తిరుమల లేపాక్షి కూడలిలో ఉన్న తాళ్లపాక అన్నమాచార్య విగ్రహం వద్ద ఆదివారం ఆయన 523వ వర్ధంతి మహోత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అన్నమయ్య విగ్రహానికి అభిషేకాలు, ప్రత్యేక పూజలు నిర్వహించారు. అభిషేక కార్యక్రమంలో అన్నమయ్య 12వ తరానికి చెందిన తాళ్లపాక వంశీకులు రాఘవ, పవన్ భరద్వాజ్, హైగ్రీవ నారాయణాచార్యులు, కంచి రాజేష్ ప్రేమ్ కుమార్, బెంగళూరుకు చెందిన విజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

News March 15, 2026

పెన్షన్ పెంపు, మహిళలకు రూ.2,500.. త్వరలో కీలక ప్రకటన!

image

TG: ఎన్నికల వేళ ఇచ్చిన హామీల్లో పెండింగ్‌లో ఉన్నవాటి అమలు దిశగా రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. 18 ఏళ్లు నిండిన మహిళలకు నెలకు రూ.2,500, పెన్షన్ రూ.4,000కు పెంపు హామీలపై రేపటి నుంచి జరిగే అసెంబ్లీ సమావేశాల్లో సీఎం ప్రకటన చేస్తారని విశ్వసనీయ సమాచారం. ఇక కొత్త సంక్షేమ పథకాలు, నీటిపారుదల, మౌలిక సదుపాయాలు, పట్టణాభివృద్ధి వంటి అంశాలపైనా కీలక నిర్ణయాలు వెల్లడించనున్నట్లు తెలుస్తోంది.