News March 26, 2024
12న హ్యాపీ డేస్ రీరిలీజ్

శేఖర్ కమ్ముల డైరెక్షన్‌లో తెరకెక్కిన యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్ ‘హ్యాపీ డేస్’ 2007లో విడుదలై సంచలన విజయం సాధించింది. ఈ సినిమాను APR 12న రీరిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ వెల్లడించారు. ఈ చిత్రంలో వరుణ్ సందేశ్, తమన్నా, నిఖిల్, రాహుల్ కీలక పాత్రల్లో నటించారు. బీటెక్ లైఫ్, విద్యార్థుల మధ్య స్నేహం, ప్రేమ కథాంశంతో రూపొందిన ఈ మూవీ యూత్‌ను విపరీతంగా ఆకట్టుకుంది. మిక్కీజే మేయర్ అందించిన మ్యూజిక్ సినిమాకే హైలైట్.
Similar News
News February 18, 2026
‘తెల్లపారుడు వ్యాధి’ని కోళ్లలో ఎలా గుర్తించాలి?

‘సాల్మొనెల్లా పుల్లొరం’ బ్యాక్టీరియా వల్ల కోడి పిల్లల్లో తెల్లపారుడు వ్యాధి కనిపిస్తుంది. ఈ వ్యాధి సోకిన కోడి పిల్లలు నలతగా ఉండి ముడుచుకుని కూర్చుంటాయి. రెట్ట నీళ్లగా తెలుపు లేదా లేత పసుపు పచ్చ రంగులో ఉంటుంది. ఈకలు రాలిపోయి, రెక్కలు వేలాడేస్తాయి. ఈ వ్యాధి నివారణకు సల్ఫా లేదా టెట్రాసైక్లిన్ ముందును చిటికెడు చొప్పున ఒక టీ గ్లాసు నీళ్లలో కలిపి రోజుకు రెండు సార్లు వెటర్నరీ నిపుణుల సూచన మేరకు ఇవ్వాలి.
News February 18, 2026
ఏపీలో క్రికెట్ ఆడే వారికి గుడ్‌న్యూస్!

క్రికెట్ బాగా ఆడే యువతకు ఫ్రీగా ట్రైనింగ్ ఇచ్చేందుకు ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ కొత్త ప్రోగ్రామ్ తీసుకురాబోతోంది. ఏప్రిల్ 5న దీనిని లాంచ్ చేసే అవకాశముంది. 19 ఏళ్లలోపు వయసున్న యువతీ యువకులకు ప్రిఫరెన్స్ ఉంటుందని, 19+ వారిని నైపుణ్యాన్ని బట్టి ఎంపిక చేస్తారని సమాచారం. ఉమ్మడి జిల్లాల ప్రాతిపదికన 88 నియోజకవర్గాల్లో ఒక్కో దాని నుంచి 20-50 మందికి అవకాశం కల్పించనున్నట్లు ACA వర్గాలు చెబుతున్నాయి.
News February 18, 2026
కొచ్చిన్ యూనివర్సిటీలో టెక్నికల్ పోస్టులు

<


