News February 17, 2025
హార్దిక్, కృనాల్ మూడేళ్లు మ్యాగీ తిని బతికారు: నీతా అంబానీ

టీమ్ ఇండియా క్రికెటర్లు హార్దిక్, కృనాల్ పాండ్యాలు మూడేళ్లపాటు మ్యాగీ తిని బతికారని ముంబై ఇండియన్స్ ఓనర్ నీతా అంబానీ తెలిపారు. వారి పట్టుదల, కసి చూసి తమ జట్టులోకి తీసుకున్నామని చెప్పారు. ‘రంజీ మ్యాచులు మొత్తం గాలించి మరీ హార్దిక్, కృనాల్, బుమ్రాలను అప్పట్లో వేలంలో కొన్నాం. 2015లో రూ.10 లక్షలతో కొన్న హార్దిక్ ఇప్పుడు ముంబై ఇండియన్స్‌కు గర్వించదగ్గ కెప్టెన్‌గా మారారు’ అని ఆమె పేర్కొన్నారు.
Similar News
News March 13, 2026
ప్రతి సినిమాకు సబ్‌టైటిల్స్ కరెక్టేనా.. మీరేమంటారు?

అన్ని సినిమాలకు సబ్‌టైటిల్స్, ఆడియో డిస్క్రిప్షన్ తప్పనిసరి చేస్తూ CBFC తీసుకున్న నిర్ణయంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. వినికిడి, దృష్టిలోపం ఉన్న వారికి ఇది ఉపయోగపడుతుందని కొందరు సపోర్ట్ చేస్తున్నారు. సబ్‌టైటిల్స్ వల్ల విజువల్ ఎక్స్‌పీరియన్స్ దెబ్బతింటుందని, మూవీని ఎంజాయ్ చేయలేమని మరికొందరు విమర్శిస్తున్నారు. నటుల యాక్టింగ్‌ను కాకుండా అక్షరాలు చూడాల్సి వస్తుందంటున్నారు. మరి మీరేమంటారు?
News March 13, 2026
ఫాంహౌస్ పాలసీ.. వచ్చే అసెంబ్లీలోనే బిల్లు

తెలంగాణలో ఫాంహౌస్‌ల నిర్మాణానికి ఓ ప్రత్యేక విధానం తీసుకురావాలని ప్రభుత్వం భావిస్తోంది. ఫాంహౌస్‌ల నిర్మాణం చట్టబద్ధం చేయడంతో పాటు అక్రమాలకు అడ్డుకట్ట వేయడం, ఆదాయాన్ని పెంచుకోవడం లక్ష్యంగా ఈ పాలసీని తీసుకురానుందట. విధివిధానాలు రూపొందించి వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో ఈ పాలసీని ప్రవేశపెట్టాలని చూస్తోంది. కాగా ఆహ్లాదం కోసం, వీకెండ్ సెలవులో నివాసాలను వదిలి ఫాంహౌస్‌లకు చాలామంది వెళ్తుండటం తెలిసిందే.
News March 13, 2026
పీఎం కిసాన్, అన్నదాత సుఖీభవ నిధులు జమ

AP: PM కిసాన్, అన్నదాత సుఖీభవ నిధులను సీఎం చంద్రబాబు విడుదల చేశారు. కృష్ణా(D) గన్నవరంలో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్న సీఎం.. అర్హులైన రైతుల ఖాతాల్లో రూ.6వేలు చొప్పున జమ చేశారు. PM కిసాన్ కింద రూ.2 వేలు, అన్నదాత సుఖీభవ మూడో విడత కింద రూ.4వేలు.. మొత్తంగా రూ.6వేలు చొప్పున రైతుల ఖాతాల్లో జమ అయ్యాయి. ఈ పెట్టుబడి సాయంతో రాష్ట్ర వ్యాప్తంగా 46.85 లక్షల మంది రైతులకు లబ్ధి కలగనుంది.


