News May 1, 2024
‘హరిహర వీరమల్లు’ నుంచి క్రిష్‌ను తప్పించారా?

పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న ‘హరిహర వీరమల్లు’ మూవీ నుంచి రెండు పోస్టర్లు విడుదలయ్యాయి. కానీ వాటిపై డైరెక్టర్ క్రిష్ పేరు లేదు. దీంతో ఈ సినిమాకు ఇప్పటికే కథ, స్క్రీన్‌ప్లే అందించిన క్రిష్‌ను తప్పించడం అన్యాయమని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. డ్రగ్స్ కేసులో క్రిష్ పేరు ఉండడమే ఇందుకు కారణమని తెలుస్తోంది. ఈ మూవీకి నిర్మాత ఏఎం రత్నం కుమారుడు జ్యోతి కృష్ణ దర్శకత్వం చేపట్టినట్లు టాక్.
Similar News
News December 9, 2025
గొర్రెల ఎంపికలో ఈ జాగ్రత్తలు తీసుకోవాలి

గొర్రెల మంద ఎదుగుదలలో ఆడగొర్రెలది కీలకపాత్ర. ఇది ఎంత బాగుంటే మంద అంత బాగుంటుంది. ఆడ గొర్రెలు త్వరగా ఎదిగి , సంతానోత్పత్తికి అనుకూలంగా మారే లక్షణం కలిగి ఉండాలి. మందలో పునరుత్పాదక శక్తి తగ్గిన, పళ్లు లేని గొర్రెలను ఏరివేయాలి. ఏడాది కంటే ఎక్కువ కాలం ఎదకి రాని గొర్రెలు, గొడ్డుమోతు జీవాలను మంద నుంచి ఏరివేసి, చూడి లేదా తొలిసారి ఈనిన గొర్రెలను కొంటే బాగుంటుంది. ఏటా ముసలి గొర్రెలను మంద నుంచి తీసేయాలి.
News December 9, 2025
‘ద్వార లక్ష్మీ పూజ’ ఎలా చేయాలి?

ఉదయాన్నే లేచి గడపను శుభ్రం చేసుకొని పసుపు, కుంకుమ, పువ్వులతో అలంకరించాలి. 3 వత్తుల దీపం, బెల్లం, అటుకులు, తాంబూలం నైవేద్యంగా పెట్టాలి. గణేషుడిని నమస్కరించి సంకల్పం చెప్పుకోవాలి. వేంకటేశ్వర స్వామి, లక్ష్మీ అష్టోత్తరాలు చదివి హారతి ఇవ్వాలి. దీపం కొండెక్కే వరకు ఉంచి, తర్వాత తొలగించాలి. పూజ పూర్తయ్యాక నిద్రపోవడం శుభకరం కాదు. పెళ్లికానివారు, ఇంటి, ఉద్యోగ సమస్యలు ఉన్నవారు ఈ పూజ చేయవచ్చు.
News December 9, 2025
IIIT కొట్టాయంలో ఉద్యోగాలు

<


