News April 11, 2024
మీ వాట్సాప్‌లో ఈ ఫీచర్ వచ్చిందా?

మెటా వాట్సాప్‌లో సరికొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తెచ్చింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌తో పనిచేసే ‘మెటా ఏఐ’ అనే ప్రత్యేక చాట్‌బోట్‌ను లాంచ్ చేసింది. ఈ ఏఐ చాట్‌బోట్‌తో యూజర్లు సరదాగా చాట్ చేయడం లేదా తమకు నచ్చిన ప్రశ్నలను అడగడం వంటివి చేయొచ్చు. Llama టెక్నాలజీ సాయంతో రూపొందిన ఈ మెటా ఏఐ ప్రస్తుతం ప్రయోగ దశలో ఉంది. కొంతమంది యూజర్లకు మాత్రమే ఈ ఫీచర్ కనిపిస్తోంది. మరి మీ వాట్సాప్‌లో ఈ ఫీచర్ వచ్చిందా?
Similar News
News December 13, 2025
కేంద్ర మాజీ మంత్రి కన్నుమూత

AP: కేంద్ర మాజీ మంత్రి కుసుమ కృష్ణమూర్తి(85) గుండెపోటుతో ఢిల్లీలో కన్నుమూశారు. దీంతో కాంగ్రెస్ నేతలు ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. కృష్ణమూర్తి అమలాపురం నుంచి మూడుసార్లు ఎంపీగా గెలిచారు. పెట్రోలియం&కెమికల్స్ శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. INC జాయింట్ సెక్రటరీగానూ పనిచేశారు.
News December 13, 2025
MECON లిమిటెడ్‌లో ఉద్యోగాలకు నోటిఫికేషన్

మెటలర్జికల్& ఇంజినీరింగ్ కన్సల్టెంట్స్ లిమిటెడ్ (<
News December 13, 2025
అతి శక్తిమంతమైన 18 కొండలు

మణికంఠుడు 18 కొండలను దాటి శబరిమలలో కొలువయ్యాడని భక్తులు నమ్ముతారు. ఆ కొండలు దాటిన భక్తులకు మోక్షం లభిస్తుందని పండితులు చెబుతారు. ఆ 18 మెట్లు: 1.పొన్నాంబళమేడు 2.గౌదవమల 3.నాగమల 4.సుందరమల 5.చిట్టంబలమల 6.దైలాదుమల 7.శ్రీపాదమల 8.ఖలిగిమల 9.మాతంగమల 10.దేవరమల 11.నీల్కల్ మల 12.దాలప్పార్ మల 13.నీలిమల 14.కరిమల 15.పుత్తుశేరిమల 16.కాళైకట్టి మల 17.ఇంజప్పార మల 18.శబరిమల. <<-se>>#AyyappaMala<<>>


