News August 12, 2025

‘రావు బహదూర్’ పాత్రలో సత్యదేవ్.. ఫస్ట్ లుక్ చూశారా?

image

టాలెంటెడ్ యాక్టర్ సత్యదేవ్ మరో విలక్షణ పాత్ర కోసం తనని తాను మార్చుకుని అందరినీ ఆశ్చర్యపరిచారు. వెంకటేశ్ మహా తెరకెక్కిస్తోన్న ‘రావు బహదూర్’ సినిమాలో టైటిల్ క్యారెక్టర్‌లో ఆయన నటిస్తున్నారు. ‘గుర్తుంచుకోండి. అనుమానం పెనుభూతం’ అంటూ తాజాగా రిలీజ్ చేసిన ఫస్ట్‌లుక్‌ ఆకట్టుకుంటోంది. వచ్చే సమ్మర్లో సినిమా రిలీజ్ చేస్తారు. ఈ చిత్రాన్ని సూపర్ స్టార్ మహేశ్‌బాబు సమర్పిస్తున్నారు.

Similar News

News March 7, 2026

రాజకీయాల్లోకి త్రిష?

image

TVK చీఫ్ విజయ్‌‌-త్రిష డేటింగ్ రూమర్స్ మధ్య మరో ఆసక్తికర వార్త వైరల్ అవుతోంది. అదే త్రిష పొలిటికల్ ఎంట్రీ. తనకు CM అవ్వాలని ఉందంటూ గతంలో ఆమె చేసిన కామెంట్స్‌ తెరపైకి వచ్చాయి. త్వరలోనే విజయ్ TVK పార్టీలో చేరనుందని జోరుగా ప్రచారం జరుగుతోంది. అందుకోసం సినిమాలకు సైన్ కూడా చేయడంలేదని మరో గాసిప్. ఇక భార్యతో విడాకుల సెటిల్మెంట్ తర్వాత త్రిషను విజయ్ వివాహం చేసుకోనున్నారని వార్తలొస్తున్నాయి.

News March 7, 2026

CEC వేలు కోసేసే వాడిని.. TMC ఎంపీ వివాదాస్పద వ్యాఖ్యలు!

image

కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ జ్ఞానేశ్ కుమార్‌పై టీఎంసీ ఎంపీ కళ్యాణ్ బెనర్జీ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ‘సీఎం మమతా బెనర్జీతో CEC చెడుగా ప్రవర్తించారు. CM వైపు వేలు ఎత్తడానికి ధైర్యం చేశారు. CEC కాకపోయుంటే నేను అదే రోజు ఆయన వేలును కోసేసే వాడిని’ అని కోల్‌కతాలో నిరసన కార్యక్రమంలో అన్నారు. SIR విషయంలో గత నెలలో జ్ఞానేశ్ కుమార్‌, మమత మధ్య జరిగిన సంభాషణను ఉద్దేశించి ఈ వ్యాఖ్యలు చేశారు.

News March 7, 2026

28,740 పోస్టులు.. ఫలితాలు విడుదల

image

పోస్టాఫీసుల్లో 28,740 బీపీఎం, GDS, ఏబీపీఎం పోస్టుల ఫలితాలు విడుదలయ్యాయి. ఫస్ట్ షార్ట్‌లిస్ట్‌ను తపాలా శాఖ <>వెబ్‌సైట్‌లో<<>> అందుబాటులో ఉంచింది. రాతపరీక్ష లేకుండా పదో తరగతిలో మెరిట్ ఆధారంగా ఎంపిక చేసింది. ఎంపికైన అభ్యర్థులు ఈ నెల 23లోపు ఒరిజినల్ డాక్యుమెంట్లను వెరిఫికేషన్ చేయించుకోవాలని సూచించింది. కాగా APలో 1,060, TGలో 608 ఉద్యోగాలున్నాయి. పోస్టును బట్టి రూ.10వేల నుంచి రూ.29,380గా శాలరీ ఉంటుంది.