News March 26, 2024

ఆమె కోసమే పరీక్ష వదిలేశాడు..

image

ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా అందరికీ సుపరిచితమే. ఆయనది ప్రేమ వివాహమే. ఇండోర్‌లో ఓ ఫిల్మ్ షూట్ సమయంలో అనురాధతో ప్రేమలో పడ్డారట. ఆమెతోనే ఉండాలనుకొని సెమిస్టర్ పరీక్ష రాయకుండా ఉండిపోయారు. ఆ తర్వాత ప్రేమలో మునిగిపోయి హీరో లెవల్లో అనురాధకు ప్రపోజ్ చేశారట. వీరిద్దరి వివాహం 1985 జూన్ 17న పెద్దల సమక్షంలో వైభవంగా జరిగింది. పెళ్లి తర్వాత వీరు చదువుకోవడానికి బోస్టన్ యూనివర్సిటీకి వెళ్లారు.

Similar News

News February 18, 2026

తిన్న తర్వాత 10 నిమిషాల నడకతో షుగర్ వ్యాధికి ఫుల్ స్టాప్!

image

భోజనం తర్వాత 10 ని.లు నడిస్తే అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని లైఫ్‌స్టైల్ కోచ్‌లు అంటున్నారు. ఈ చిన్న అలవాటు రక్తంలో షుగర్ లెవెల్స్ సడన్‌గా పెరగకుండా కంట్రోల్‌లో ఉంచుతుంది. ఇన్సులిన్ రెస్పాన్స్‌ను ఇంప్రూవ్ చేస్తుంది. జీర్ణక్రియను వేగవంతం చేసి గ్యాస్, ఉబ్బరం వంటి సమస్యలను తగ్గిస్తుంది. ఎటువంటి ఖర్చు లేకుండా ఎక్కడైనా చేయగలిగే ఈ 10 నిమిషాల నడక దీర్ఘకాలంలో టైప్-2 డయాబెటిస్ ముప్పును తప్పిస్తుంది.

News February 18, 2026

పంచాయతీల్లో ఓటుహక్కు నమోదు ఇకపై ఏడాదికి 4సార్లు

image

AP: పంచాయతీల్లో ఓటుహక్కు నమోదు ఏడాదికి 4సార్లు నిర్వహించేలా చట్ట సవరణ బిల్లును అసెంబ్లీ ఆమోదించింది. ఇప్పటివరకు JAN 1న మాత్రమే ఓటరు నమోదు జరుగుతోంది. తరువాత పుట్టిన వారు ఏడాది పాటు వేచి ఉంటున్నారు. ఈ బిల్లుతో ఇకపై JAN, APR, JUL, OCT నెలల్లో 1న ఓటు నమోదు చేసేలా చట్టాన్ని సవరించారు. మంత్రి కందుల దుర్గేశ్ ఈ బిల్లును ప్రవేశపెట్టారు. అసెంబ్లీ, మున్సిపల్ ఓట్ల నమోదు కూడా ఏటా 4సార్లు చేస్తున్నారు.

News February 18, 2026

మరోసారి అభిషేక్ డకౌట్

image

T20WC: భారత డాషింగ్ ఓపెనర్ అభిషేక్ శర్మ మరోసారి నిరాశ పరిచారు. పసికూన నెదర్లాండ్స్‌పై పరుగులేమీ చేయకుండానే వెనుదిరిగారు. ఇన్నింగ్స్ మూడో బంతికే ఆర్యన్ దత్ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ్ అయ్యారు. కాగా అభిషేక్ ఈ ప్రపంచకప్‌లో ఆడిన మూడు మ్యాచుల్లోనూ డకౌట్ కావడం గమనార్హం.