News March 31, 2024

చరిత్రలో ధోనీ ఒకే ఒక్కడు

image

CSK మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ అరుదైన రికార్డు నెలకొల్పారు. టీ20ల్లో 300 క్యాచులు అందుకున్న తొలి వికెట్ కీపర్‌గా నిలిచారు. ఇవాళ ఢిల్లీతో మ్యాచులో పృథ్వీషా క్యాచ్‌తో ఈ ఘనత అందుకున్నారు. ఆ తర్వాతి స్థానాల్లో కమ్రాన్ అక్మల్(274), దినేశ్ కార్తీక్(274), డికాక్(270), జోస్ బట్లర్(209) ఉన్నారు.

Similar News

News February 7, 2026

బీట్‌రూట్‌తో బ్యూటీ

image

బీట్‌రూట్‌ను డైట్‌లో భాగం చేసుకోవడం వల్ల ఆరోగ్యానికి ఎన్నో లాభాలున్నాయన్న విషయం తెలిసిందే. అయితే దీంతో అందాన్ని కూడా పెంచుకోవచ్చంటున్నారు నిపుణులు. * బీట్‌రూట్ రసం, పెరుగు కలిపి ముఖానికి అప్లై చేసి 15 నిమిషాల తర్వాత కడిగేయాలి. దీంతో ముఖంపై మచ్చలు తగ్గుతాయి. * బీట్‌రూట్ రసం, ఓట్స్ కలిపి స్క్రబ్ చేసుకుంటే రక్త ప్రసరణ పెరిగి చర్మం మెరుపు, మృదుత్వం పెరుగుతుంది.

News February 7, 2026

రేపు భాను సప్తమి.. ఏం చేయాలంటే?

image

ఆదివారం సప్తమి తిథితో వస్తే దాన్ని భాను సప్తమి అంటారు. ఈ పండగ రోజు చేసే కొన్ని పనులు మనకు మంచి చేస్తాయని శాస్త్రాలు చెబుతున్నాయి. వాటి ప్రకారం.. సూర్యోదయానికి ముందే నిద్రలేచి స్నానం చేయాలి. సూర్యుడికి అర్ఘ్యం సమర్పించాలి. ఆవు పాల పరమాన్నాన్ని నైవేద్యంగా పెట్టాలి. దానధర్మాలు చేస్తే మంచిది. వీటివల్ల దరిద్రం తొలగి, ఆరోగ్యం, ఐశ్వర్యాలు సిద్ధిస్తాయని నమ్మకం. పూర్తి వివరాల కోసం క్లిక్ <<-se_10013>>భక్తి కేటగిరీ<<>>.

News February 7, 2026

‘వాట్సాప్ మీ సేవ’లో 581 సేవలు

image

TG: ‘వాట్సాప్ మీ సేవ’లో ఇప్పటివరకు 4.5L మంది తమ వివరాలు నమోదు చేసుకున్నారని ప్రభుత్వం వెల్లడించింది. వారిలో 3.25L మంది డిజిటల్ సేవలు అందుకున్నారని తెలిపింది. ఆఫీసుల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా 8096958096 అనే వాట్సాప్ నంబర్‌కు HI అని మెసేజ్ చేసి 581 రకాల సేవలు పొందవచ్చని పేర్కొంది. బర్త్, డెత్, ఇన్‌కమ్, క్యాస్ట్ సర్టిఫికెట్లు, లైసెన్సులు, ఎలక్ట్రిసిటీ బిల్లులు తదితరాలను పొందవచ్చంది.